యూ టర్న్ ట్రైలర్ ఎలా ఉందంటే ?

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత తొలి సారి చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ “యూ టర్న్”. కన్నడలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత జర్నలిస్ట్ గా కనిపించనుంది. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని నేడు అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

సమంత వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ వీడియో ఉత్కంఠతను కలిగించింది. బార్ కౌంటర్ లో ఎందుకు సమంత కూర్చుంది? ఆర్కే పురం ప్లై ఓవర్ మీద జరిగింది.. యాక్సిడెంటా?.. హత్య?, ఆ సంఘటనకి సమంతకి ఏమి సంబంధం ఉంది?.. పోలీసులు ఆమెను ఎందుకు అనుమానిస్తున్నారు? ఆమెకి ఎవరిపై అనుమానం ఉంది..? ఈ ప్రమాదం వెనుక.. అసలు యూ టర్న్ వెనుక ఏమి దాగుంది.. అని అనేక ప్రశ్నలను ఈ ట్రయిల్ రేకెత్తించింది. ఈ సినిమాకి సమంత నటన మాత్రమే కాదు వాయిస్ కూడా ప్లస్ కానుందని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంపై తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus