Chiranjeevi, Balakrishna: చిరు – బాలయ్యల నాలుగు బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు..!

మెగాస్టార్ చిరంజీవి – నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ – ఏఎన్నార్ తర్వాతి జనరేషన్‌లో టాలీవుడ్ టాప్ స్టార్స్.. ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.. రేర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు.. ముఖ్యంగా ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో ఎవరికి వారే సాటి.. డిఫరెంట్ సినిమాలు, జానర్ల వంటి వన్నీ టచ్ చేశారు.. 1990 కాలంలో పోటా పోటీగా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు..

చిరు – బాలయ్య కలయికలో మల్టీస్టారర్ వస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. కొద్దిరోజుల క్రితం ‘అ!’, ‘కల్కి’ ఇప్పుడు ‘హనుమాన్’ తీస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ అగ్రహీరోలతో మల్టీస్టారర్ తియ్యడం తన డ్రీమ్ అని, కచ్చితంగా చేసి తీరుతానని అంటే.. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాత్రం.. నేరుగా బాలయ్యతోనే.. చిరంజీవి, మీ కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తాను అనగానే.. బాలయ్య అప్పుడది పాన్ వరల్డ్ సినిమా అవుతుందనడం చూశాం..

ఇప్పటికీ చిరు – బాలయ్య మల్టీ స్టారర్ కుదరలేదు కానీ అప్పట్లో మాత్రం వారు నటించిన సినిమాలు కలిసి సందడి చేసేవి.. ఎలా అంటారా?.. ఆడియో క్యాసెట్ కాంబినేషన్ రూపంలో.. ఇలా మాత్రమే ఈ క్రేజీ కాంబో సాధ్యమయ్యేది.. 1990, 91, 92 టైంలో సిసలైన మాస్ సినిమాలకు నిర్వచనంలా నిలిచిన చిరు, బాలయ్య బాబుల నాలుగు బ్లాక్ బస్టర్ మూవీస్‌కి సంబంధించిన ఇన్లే కార్డ్స్ ఇవి.. ఇలాంటి క్యాసెట్లతో అల్మారా నిండుగా ఉండటం అనేది అందరి ఇళ్లల్లో, ఆ టైంలో చాలా మామూలు విషయం..

ఇక వీటి టైటిల్స్‌కి కూడా దగ్గరి పోలికలుండడం విశేషం.. ‘రౌడీ అల్లుడు’ – ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’, ‘గ్యాంగ్ లీడర్’ – ‘లారీ డ్రైవర్’.. ఈ నాలుగు కూడా ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.. మెగాస్టార్, యుగాస్టార్ ఇద్దరినీ కలిపి తెరమీద చూడకపోయినా.. ఇలా ఇన్లే కార్డల మీద కాంబినేషన్ చూడడం ప్రేక్షకాభిమానులకు అదో ఆనందం..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus