Khaidi Movie: 39 ఏళ్ళ ‘ఖైదీ’ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘ఖైదీ’ టాలీవుడ్లో రూపొందిన ఓ కల్ట్ క్లాసిక్ మూవీ. అంతేకాదు ఇది ఓ గేమ్ ఛేంజర్ మూవీ కూడా..! టాలీవుడ్ రూపురేఖల్ని మొత్తం మార్చేసిన మూవీ ఇది. ‘ఖైదీ’ కి ముందు కమర్షియల్ సినిమా ఓ లెక్క, ‘ఖైదీ’ తర్వాత కమర్షియల్ సినిమా ఇంకో లెక్క. అప్పటివరకు చిరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేవి కానీ రికార్డుల మొహం చూసేవి కాదు. దానికి చిరు స్టామినా ఏంటో రుచి చూపించిన మూవీ ‘ఖైదీ’. 1983 వ సంవత్సరం అక్టోబర్ 23న ‘ఖైదీ’ మూవీ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 39 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ 39 ఏళ్ళ నుండి చిరంజీవి నిజంగా బెయిల్ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బందీ అయిపోయాడు. అలాంటి ఈ ‘ఖైదీ’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) నిజానికి ‘ఖైదీ’ మూవీ సూపర్ స్టార్ కృష్ణ గారు చేయాల్సిన మూవీ. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. దీంతో చిరంజీవికి ఆ అవకాశం దక్కింది.

2) మొదట ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. కానీ ఆయన కూడా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. దీంతో కోదండరామిరెడ్డి డైరెక్టర్ గా ఎంపికయ్యారు.

3) చిరంజీవికి ఆస్థాన రైటర్స్ గా పేరొందిన పరిచూరి బ్రదర్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు అల్లిన కథ ఇది.

4) 1982 లో వచ్చిన అమెరికన్ మూవీ ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా రూపొందిన మూవీ ‘ఖైదీ’. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల వరకు చిరు కథ వినలేదు. కొద్దిరోజుల తర్వాత చిరు పూర్తి కథ వినడం జరిగింది. అది పరిచూరి సోదరుల పై చిరుకి ఉన్న నమ్మకం వల్ల.

5) ఈ చిత్రానికి చిరంజీవి రూ.1,75,000 పారితోషికంగా అందుకున్నారు. కోదండరామిరెడ్డి రూ.40,000 అందుకున్నారు.

6) ఈ చిత్రం 100 రోజుల వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ గారు అతిథిగా విచ్చేయడం జరిగింది.

7) 1984 లో ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో జితేంద్రతో రీమేక్ చేశారు. రీమేక్ లో కూడా మాధవి హీరోయిన్ గా నటించింది.

8) ‘ఖైదీ’ 1983 సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.

9) ఆరోజుల్లో ఈ మూవీకి 3.2 కోట్ల టికెట్లు తెగాయి. ఆ టైంలో ఇది ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.

10) ‘ఖైదీ’ రూ.25 లక్షల బడ్జెట్ లో రూపొందిన మూవీ. రూ.70 లక్షలు బిజినెస్ చేసిన మూవీ. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే రూ.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

11) ‘ఖైదీ’ చిత్రం ఆ రోజుల్లో 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది.

కొన్నాళ్ల క్రితం వరకు ‘ఖైదీ’ చిత్రాన్ని చరణ్ రీమేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. ఒకసారి రాంగోపాల్ వర్మ అయితే పూరి జగన్నాథ్ – మహేష్ బాబు కాంబినేషన్లో ‘ఖైదీ’ మూవీ రీమేక్ అవుతుంది అంటూ ట్వీట్ కూడా వేసి సంచలనం సృష్టించాడు. ‘ఖైదీ’ ఇంపాక్ట్ అలా ఉండేది మరి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus