శంకరాభరణం సినిమా విడుదల అయ్యి సరిగ్గా 41సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఇంతటి క్లాసికల్ హిట్ సినిమా వెనక కూడా పెద్ద సినిమానే ఉంది. చాలామంది శ్రమ దాగి ఉంది. నిజానికి ఈ సినిమాని తీయడానికి అలాగే అమ్మడానికి కూడా కష్టపడ్డారు. ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలని మనం చూసినట్లయితే,
* శంకరాభరణం సినిమాకి హీరోగా జెవి సోమయాజులు అనేసరికి ప్రొడ్యూసర్స్ ఎవరూ ముందుకు రాలేదు. విశ్వనాధ్ గారు ఈ కథని పట్టుకుని ఎంతో మంది ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగారట. కానీ ఒక్కరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు. అప్పట్లో హైదరాబాద్ లో ఉండే శివలంక కాశీగారిని సైతం కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయమని బ్రతిమిలాడారట. కానీ ఆయన సినిమాలపై మక్కువ లేదని, నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పేసరికి ఈ ప్రాజెక్ట్ ని ఆపేద్దామని డిసైడ్ అయ్యారట విశ్వనాధ్ గారు.
** అప్పుడు ఏడిద నాగేశ్వర్రావు గారు ముందుకు వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పడంతో శంకరాభరణం ప్రాజెక్ట్ మొదలైంది. ఎన్నో లొకేషన్స్ లో ఈ సినిమాని అప్పట్లోనే ఎంతో ఖర్చుపెట్టి నమ్మకంతో తీసారు.
*** సినిమా రిలీజైన మూడు వారాల పాటు అస్సలు థియేటర్స్ కి జనం రాలేదు. తర్వాత మౌత్ టాక్ వచ్చి హౌస్ ఫుల్స్ అయ్యి నాలుగోవారం నుంచి టిక్కెట్స్ బ్లాక్ లో కూడా అమ్మారు.
**** విశ్వనాధ్ గారికి ఉన్న సెంటిమెంట్ ప్రకారం ఈసినిమాని హైదరాబాద్ లో మొదటిరోజు వచ్చి చూసినపుడు బాల్కనీలో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారట. గుంతకల్లు డిస్ట్రిబ్యూటర్ తో కలిసి ఈ సినిమా చూసిన విశ్వనాధ్ గారు ఇది ఆడుతుందా లేదా అని అనుకున్నారట.
*** రిలీజ్ కి ముందు మద్రాస్ లో నడిగర్ సంఘం లో సినిమా ప్రివ్యూ వేసినపుడు బాగుంది బాగుంది అన్నవాళ్లే తప్ప, సినిమా కాన్ఫిడెన్స్ గా కొన్నవాళ్లు లేరని అప్పుడు ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరావుగారు కొన్ని జిల్లాలలో నష్టానికి సినిమాని విడుదల చేశారని చెప్తారు.
*** ఈ సినిమా మొదట్లో కొన్ని థియేటర్స్ లో తీసేసి మళ్లీ హిట్ అయిన తర్వాత కొనుక్కున్న కొనుగోలుదారులు ఉన్నారు.
*** ఇక సినిమా కొనడానికి వచ్చినవాళ్లు సోమయాజులు బదులుగా నాగేశ్వరావుగారిని పెట్టాలని, మంజుభార్గవికి బదులు జయమాలిని పెట్టి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేదని అన్నారట.
*** ఇన్ని ఆవాంతరాలు దాటుకుని వచ్చిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. విమర్శకుల నోళ్లు మూయించింది. సాంగ్స్ హిట్, సీన్స్ హిట్స్, డైరెక్షన్ బెస్ట్ అంటూ పొగిడిన వాళ్లే ఉన్నారు. కళాతపస్వి విశ్వనాధ్ గారికే కాకుండా, గాయకుడిగా ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది ఈ సినిమా.
**** తమిళ కన్నడ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత మలయాళంలో ఓన్లీ డైలాగ్స్ మాత్రమే డబ్బింగ్ చేసినా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. హిందీలో బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ సినిమా.
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!