అనిల్ రావిపూడి గురించి 15 ఆసక్తికర విషయాలు..!

రాజమౌళి తర్వాత అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) నిలిచాడు. వరుసగా 8 హిట్లు కొట్టి.. ట్రిపుల్ హ్యాట్రిక్ కి రెడీ అయిన అనిల్ రావిపూడి.. నేటితో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

Anil Ravipudi

1) అనిల్ రావిపూడి (Anil Ravipudi) ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని తండ్రి ఆర్టీసీ కండక్టర్. అతని రూ.5000 సంపాదనతోనే కుటుంబం మొత్తాన్ని పోషించేవారట. ఇదంతా చూసే అనిల్ రావిపూడి పెరిగారట.

2) అనిల్ రావిపూడి బీటెక్ వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి అతనికి సినిమాలంటే ఇష్టం ఎక్కువ. ‘క్లాస్ ఎప్పుడు అవుతుంది.ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోతాం.థియేటర్ ఎంత దూరం’ అనే ఆలోచనలే అనిల్ రావిపూడికి ఉండేవట. ఫైనల్ గా బీటెక్ కంప్లీట్ అయ్యింది. యావేరేజ్ మార్కులతోనే అనిల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు.

3) ‘తమ్ముడు’ దర్శకుడు అరుణ్ ప్రసాద్.. అనిల్ రావిపూడికి దూరపు చుట్టం. దీంతో అతని వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు అనిల్. ‘గౌతమ్ ఎస్ ఎస్ సి’ అనే సినిమాకి అనిల్.. అరుణ్ ప్రసాద్ వద్ద పనిచేశారు. రైటింగ్లో బాగా శిక్షణ పొందాడు.

4) గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన ‘శౌర్యం’ (Souryam) సినిమాకి అనిల్ రావిపూడి ఓ రైటర్ గా పనిచేశాడు. ‘సిరుతై’ శివ (Siva) ఆ చిత్రానికి దర్శకుడు. కానీ ఆ సినిమాకు గాను అనిల్ కి ఎటువంటి క్రెడిట్ ఇవ్వలేదట. దీంతో అతను బాగా హర్ట్ అయ్యాడట. అది హిట్టు సినిమా. అయినా క్రెడిట్ ఇవ్వకపోవడంతో అనిల్ హర్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు.

5) అయితే ఆ తర్వాత వచ్చిన ‘శంఖం’ (Sankham) సినిమాకి అనిల్ కి క్రెడిట్ ఇచ్చాడట శివ. కానీ ఆ సినిమా ఆడలేదు.

6) రామ్ (Ram) హీరోగా సంతోష్ శ్రీనివాస్ (Santosh Srinivas) దర్శకత్వంలో ‘కందిరీగ’ (Kandireega) అనే సినిమా వచ్చింది. దీనికి అనిల్ రావిపూడి ఓ రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమాకి క్రెడిట్ ఇచ్చారట. సినిమా కూడా మంచి విజయం సాధించింది. ‘కందిరీగ’ సినిమాలో సోనూసూద్ నటించేలా చేసింది అనిలేనట. వాస్తవానికి ఆ సినిమాలో సోనూసూద్ (Sonu Sood) విలన్ రోల్ చేశాడు. కానీ అతను సెకండ్ హీరో అని కన్విన్స్ చేశాడట అనిల్. సినిమా హిట్ అవ్వడంతో ఆ విషయాన్ని సోనూ సూద్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదట.

7) అటు తర్వాత రవితేజ (Ravi Teja) ‘దరువు’ (Daruvu), వెంకటేష్ (Venkatesh Daggubati) ‘మసాలా’ (Masala), మహేష్ బాబు (Mahesh Babu) ‘ఆగడు’ (Aagadu) వంటి సినిమాలకు అనిల్ రావిపూడి రైటర్ గా పనిచేశాడు. కానీ ఆ సినిమాలు ప్లాప్ అయ్యాయి.

8) విచిత్రం ఏంటి అంటే.. అదే హీరోలకి దర్శకుడిగా మాత్రం అనిల్ హిట్లు ఇచ్చాడు. రవితేజకి ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) తో, వెంకటేష్ కి ‘ఎఫ్ 2’ (F2 Movie), మహేష్ బాబుకి ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) తో హిట్లు ఇచ్చాడు అనిల్.

9) నాని (Nani) నటించిన ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) సినిమా క్లైమాక్స్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. నందినీ రెడ్డి (Nandini Reddy) ఆ చిత్రానికి డైరెక్టర్. కానీ ఆ సినిమా క్లైమాక్స్ ని డిజైన్ చేసింది అనిల్ రావిపూడి అని ఎక్కువ మందికి తెలిసుండదు.

10) అనిల్ రావిపూడికి మొదటి ఛాన్స్ అంత ఈజీగా దొరకలేదు. ‘పటాస్’ (Pataas) కథ పట్టుకుని ఎన్టీఆర్, రానా వంటి హీరోల చుట్టూ తిరిగాడు అనిల్. ఫైనల్ గా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఓకే చేశాడు. కళ్యాణ్ రామ్ ఆ టైంలో ప్లాపుల్లో ఉండటం వల్ల ఏ నిర్మాత కూడా ‘పటాస్’ ని నిర్మించడానికి ముందుకు రాలేదట. కళ్యాణ్ రామ్ నిర్మాతగా కూడా ‘ఓం 3D’ (Om 3D) సినిమాతో నష్టాల్లో ఉన్నాడు. అయినా సరే అనిల్ స్క్రిప్ట్ పై ఉన్న నమ్మకంతో ‘పటాస్’ ని నిర్మించాడట కళ్యాణ్ రామ్.

11) ‘పటాస్’ సినిమా కంప్లీట్ అయ్యాక.. డిస్ట్రిబ్యూటర్స్ కి, శాటిలైట్ హక్కులు కొనుగోలు చేసేవారికి షో వేశారట. షో అనంతరం కొంతమంది వచ్చి ‘ఇదేం సినిమా, అసలు ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు’ అంటూ నానా మాటలు అన్నారట.

12) అయితే తర్వాత కళ్యాణ్ రామ్.. దిల్ రాజుకి (Dil Raju)  స్పెషల్ షో వేసి చూపించగా, ఆయన బాగుంది అని చెప్పి నైజాం థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నారట. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

13) అటు తర్వాత దిల్ రాజే… అనిల్ తో వరుస సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. 8 సినిమాల్లో 6 దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.

14) ‘ఎఫ్ 2’ సినిమాతో అనిల్ రావిపూడి రూ.100 కోట్ల దర్శకుడిగా మారాడు. అప్పటి నుండి అతనిపై నెగిటివిటీ కూడా ఏర్పడింది. అయినా సరే ఆ నెగిటివిటీతో డిజప్పాయింట్ అవ్వకుండా తన స్ట్రెంత్ పైనే గేమ్ ఆడుతూ వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

15) మొత్తానికి ఈ 10 ఏళ్లలో అనిల్ రావిపూడి తీసిన సినిమాల్లో రూ.200 కోట్లు కలెక్ట్ చేసినవి రెండు సినిమాలు ఉన్నాయి. 100 కోట్లు కలెక్ట్ చేసినవి 3 సినిమాలు ఉన్నాయి.

ఇలా ఒక సక్సెస్ ఫుల్ సినిమాకి పేరు వేయకపోవడం వల్ల..సక్సెస్ కి మారుపేరు అయిపోయాడు అనిల్ రావిపూడి.

హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus