Ammoru Movie: 26 ఏళ్ళ ‘అమ్మోరు’ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

ఒక స్టార్ హీరో… ఇంట్రొడక్షన్లో భారీ ఫైట్, ఇంటర్వెల్ వద్ద మరో భారీ ఫైట్.. అది కూడా పవర్ ఫుల్ డైలాగులతో,ఇక సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్, కామెడీ ట్రాక్ లు, క్లైమాక్స్లో విలన్ తో మరో భారీ ఫైట్, ఎండ్ కార్డ్, ఇలాంటి మూసధోరణికే తరతరాలుగా జనాలు అలవాటు పడిపోయారు.అయితే దర్శకుడు కోడి రామకృష్ణ గారు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పి… గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాకి కొత్త కమర్షియల్ హంగులు అద్దారు. అదే ‘అమ్మోరు’ చిత్రం. సురేష్, సౌందర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, సునైనా చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించారు.

విలన్ గా రామిరెడ్డి, వడిఉక్కరిసి, బాబు మోహన్ లు కూడా అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1995వ సంవత్సరం నవంబర్ 23న ఈ చిత్రం విడుదలైంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు వసూళ్ళు పెద్దగా నమోదు కాలేదు. కానీ రెండో రోజు నుండీ హౌస్ ఫుల్ బోర్డులతో ఈ చిత్రం థియేటర్లన్నీ కళకళలాడిపోయాయి. ఒక్కో సన్నివేశాన్ని గ్రాఫిక్స్ తో కోడిరామకృష్ణ తీర్చిదిద్దిన తీరు టాలీవుడ్ ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని కలిగించింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు నిర్మిస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు

ఆయనకి ఫోన్ చేసి మరీ ఎందుకు ఇంత అనవసరమైన ఖర్చు పెడుతున్నారు అంటూ హెచ్చరించారట. కానీ అలా కామెంట్లు చేసిన టాప్ హీరోలే మళ్ళీ కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో గ్రాఫిక్స్ తో కూడుకున్న సినిమాల్లో నటించారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ‘అమ్మోరు’ చిత్రానికి బడ్జెట్ ఆ రోజుల్లో రూ.4 కోట్ల వరకు పెట్టగా ఫుల్ రన్లో ఆ చిత్రం రూ.11 కోట్లకి పైనే కలెక్ట్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. అటు తర్వాత ‘దేవి’ ‘అరుంధతి’ వంటి సినిమాలు రావడానికి కూడా ఇది ప్రేరణ కల్పించింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus