Anchor Shiva: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ శివ గురించి ఆసక్తికరమైన 10 విషయాలు..!

‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటిటి వెర్షన్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సీజన్ కు 14వ కంటెస్టెంట్‌గా యాంకర్ శివ ఎంట్రీ ఇచ్చాడు. ‘ఇప్పటి వరకు నన్ను ప్రేక్షకులంతా ఒకలా చూసారు, ఇప్పుడు నాలోని ఇంకో యాంగిల్‌ని చూపించేందుకు బిగ్ బాస్ షోలోకి వచ్చాను. నేను స్నేహం చేస్తే ఎలా ఉంటుంది.. నా వెనక గోతులు తీస్తే నేను వాళ్లకి ఎలా తీస్తాను’ అనే విషయాలను చూపిస్తాను. బిగ్ బాస్ ఇంట్లో డబ్బులు గెలవాలి.. చెల్లి పెళ్లి చేయాలి అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శివ. ఇతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం :

1) 1996 వ సంవత్సరంలో మే 27 న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జన్మించాడు శివ.

2) అతను పుట్టి పెరిగింది అంతా శ్రీకాకుళంలోనే..! ఇతని వయసు 25 సంవత్సరాలు మాత్రమే..!

3) చిన్నప్పటి నుండీ ఇతనికి యాంకరింగ్ అంటే ఇష్టం. న్యూస్ ఛానెల్స్ లో యాంకర్ లా సెలబ్రిటీలను ప్రశ్నలు అడగాలని వారి నుండీ నిజాయితీతో కూడిన సమాధానాలు రాబట్టాలనేది ఇతని ప్రధాన ఉద్దేశం.

4) శివ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. కానీ శివ పుట్టినప్పటి నుండీ వీళ్ళ ఫ్యామిలీ ఎక్కువగా అప్పులు చేసింది లేదు. ఎటువంటి వేడుకలైనా ఉన్నంతలో తమ బందు మిత్రుల సమక్షంలోనే చేసుకుంటూ ఉండేవారు. అందుకే వీళ్లది చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ శివ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

5) డిగ్రీ కంప్లీట్ చేసాక శివ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు. చాలా న్యూస్ ఛానల్స్ చుట్టూ యాంకర్ అవకాశాలు కోసం తిరిగేవాడు. కానీ ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు.

6) దాంతో తనే స్వయంగా భారీ ఖర్చు పెట్టి ఓ ఇంటర్వ్యూ చేసాడు. దానిని పట్టుకుని మళ్ళీ న్యూస్ ఛానెల్స్ చుట్టూ తిరిగేవాడు. అది చూసిన కొంతమంది ‘నువ్వు యాంకర్ గా పనికిరావు’ అని అవమానించేవారు.

7) యాంకర్ అవ్వడం కోసం చివరికి కార్ డ్రైవర్ గా కూడా చేసాడట శివ.

8) చివరికి తాను అనుకున్నది సాధించాడు.2017 లో ఓ న్యూస్ ఛానెల్ లో జాబ్ కొట్టాడు. తర్వాత మొత్తంగా 7 ఛానల్స్ కు పనిచేసాడు.

9) తర్వాత సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుని దానిని డెవలప్ చేస్తూ తానూ పాపులర్ అయ్యాడు.

10) మొన్నామధ్య జబర్దస్త్ షోలో అనసూయ డ్రెస్సింగ్ గురించి బోల్డ్ క్వశ్చన్స్ అడిగి.. ఆమెకు కోపం తెప్పించాడు శివ. ఈ వీడియో అప్పట్లో చాల వైరల్ అయ్యింది. కానీ చివరికి అది స్కిట్ లో భాగం అన్నట్టు ముగించారు.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus