Arjun Kalyan ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు…!

‘బిగ్ బాస్ 6’ మొదలై వారం రోజులు దాటింది. విచిత్రం ఏంటి అంటే ఆదివారం నాడు ఎలిమినేషన్ జరగలేదు. కాబట్టి ఈ సీజన్ ను బిగ్ బాస్ ఏదో కొత్తగా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతుంది. రెండో వారం నుండి ఏదో ఒక వారం డబల్ ఎలిమినేషన్ ప్రక్రియ అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని స్పష్టమవుతుంది.ఇదిలా ఉండగా.. ఈ సీజన్ కు 7 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అర్జున్ కళ్యాణ్. మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ ను డ్రా చేసిన ఇతని పై గ్లామర్ బాయ్ అనే ముద్ర పడింది. ఇతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) అర్జున్ కళ్యాణ్ జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు.

2) అయితే ఇతని విద్యాభ్యాసం మొత్తం వైజాగ్ లో జరిగింది. అటు తర్వాత ఇతను మాస్టర్ డిగ్రీ కోసం అమెరికా వెళ్ళాడు.

3) యూ.ఎస్ లోనే థియేటర్స్ కోర్స్ కూడా చేశాడు అర్జున్. ‘చిన్న సినిమా’ అనే మూవీ షూటింగ్ అమెరికాలో జరగడంతో ఆ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించి.. అది ఫలించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్.

4) ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత ‘ఉప్మా తినేసింది’ ‘పరిచయం’ వంటి షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లలో నటించాడు.

5) కెరీర్ ప్రారంభంలో అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కూడా పనిచేశాడు. కొన్నాళ్ళు వాల్యూ లాబ్స్ కంపెనీలో కూడా పనిచేశాడట.

6) స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్ పై అర్జున్ కళ్యాణ్ కి మంచి గ్రిప్ ఉంది. అందుకే ఇతను నటనలో స్థిరపడగలిగాడు.

7) ‘చిన్న సినిమా’ తో పాటు ‘ప్రేమమ్’ ‘ప్లే బ్యాక్’ ‘వరుడు కావలెను’ ‘పెళ్లి కూతురు పార్టీ’ మొదలగు సినిమాల్లో ఇతను నటించాడు.

8) అర్జున్ కళ్యాణ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇతని పేరు వెనుక కళ్యాణ్ ఉండడానికి కూడా కారణం అదే అని ఇతని స్నేహితులు తెలియజేసారు.

9) అర్జున్ కళ్యాణ్ గతంలో ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్టు కూడా టాక్ నడిచింది. తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయిపోయారనే వార్తలు కూడా వచ్చాయి.

10) ఇక ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 35 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

మరి ‘బిగ్ బాస్ 6’ ఇతని కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus