Basha Movie: 27 ఏళ్ల గేమ్ చేంజర్ మూవీ బాషా గురించి 10 ఆసక్తికర విషయాలు..!

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచిన మూవీ ‘బాషా’. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, ఫ్లాష్ బ్యాక్ కథలలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది బాషా. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు రజనీ నట విశ్వరూపం ఈ సినిమాను ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటిగా నిలిపింది. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోతారు. 1995 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాషా వసూళ్ల దుమ్ము దులిపింది. ఈ ఏడాదితో ఈ సినిమా విడుదలైన 27 ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో బాషా గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్.

1) ఈ సినిమా కథను దర్శకుడు సురేష్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవికి చెప్పడంతో ఆయన రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగారట. ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25 లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో బాషా తెలుగు రీమేక్‌కు సాధ్యం కాలేదు.

2) ఈ సినిమాలో చాలా భాగం ముంబై నేపధ్యంలో జరుగుతుంది. విలన్ తో జరిగే కొన్ని ప్రధాన సన్నివేశాలను ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, హోటల్ తాజ్ ప్రాంతంలో తెరకెక్కించారు.

3) మంచివాడు మొదట కష్టపడొచ్చు.. కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడొచ్చు.. కానీ ఓడిపోతాడు. బాషా.. మాణిక్ బాషా. ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటూ రజనీ చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి.

4) బాషాకు ముందు బాషాకు వెనకాల అనే స్థాయిలో రజని మేనియా తెలుగునాట స్టార్ట్ అయ్యింది. తర్వాతి నుంచి ఆయన నటించిన అన్ని చిత్రాలు తెలుగులో డబ్బ్ అయి.. తమిళ్‌తో పాటు ఏకకాలంలో రిలీజ్ అయ్యేవి.

5) ఏడాది పాటు ఆడిన బాషా అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 38 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని అంచనా.

6) ఈ చిత్రంలోని నేను ఆటో వాడిని పాటని 100 మంది డ్యాన్సర్లతో మద్రాస్‌లోని విజయ వాహిని స్టూడియోలో చిత్రీకరించారు.

7) బాషాలోని స్టైల్ స్టైలురా పాటను జేమ్స్ బాండ్ థీమ్ నుంచి తీసుకున్నారు

8) బాషా సినిమా మ్యూజిక్ రైట్స్‌ని అప్పట్లోనే ఏవీఎం ఆడియో 25 లక్షలకు కొనుగోలు చేసింది. దీని విలువ ఇప్పుడు కోట్లలో వుంటుందని అంచనా

9) ఈ సినిమాలోని మానిక్, ఆంటోనీ పేర్లతో తర్వాతి కాలంలో సినిమాలు వచ్చాయి.

10) డిజిటల్ పరంగా మార్పు చేసిన బాషా సినిమాను 2017 మార్చి 3న విడుదల చేశారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus