నవ్వుకి బ్రాండ్ అంబాసడర్ అయిన స్టార్ డైరెక్టర్ ఇవివి గురించి మనకు తెలియని విషయాలు..!

  • January 21, 2022 / 05:31 PM IST

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ గారు ఇప్పటి జెనెరేషన్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఇప్పటి జెనెరేషన్ కూడా అయన సినిమాల్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన చనిపోయి ఈరోజుతో 11 ఏళ్ళు అవుతున్నా… ఆయన సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి అనేది అక్షర సత్యం. మరి ఆయన గురించి మనకు తెలియని కొన్ని విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1)1956 వ సంవత్సరం జూన్ 10న …ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని దొమ్మేరు అనే ఊరిలో ఓ రైతు కుటుంబంలో ఇవివి గారు జన్మించారు పుట్టాడు.ఈయన పూర్తి పేరు ఈదర వీర వెంకట సత్యనారాయణ.ఈయన తండ్రి పేరు వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇ.వి.వి గారికి దొమ్మేరులో 70 ఎకరాల వరకు పొలం ఉంది.

2) ఈయన ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదువుకున్నారు. తర్వాత సినిమాల పై ఆసక్తితో చెన్నై వచ్చేసారు. ఇవివి గారి తండ్రి వెంకట్రావ్ గారికి… ఈ విషయమై ఎంతో కోపం వచ్చింది. ఆయన ఎంత మందలించినా ఇవివి గారు మనసు మార్చుకోలేదు. దాంతో ఇవివి గారికి సరస్వతి కుమారి గారితో పెళ్లి చేసేసారు. కొన్నాళ్ళు పొలం పనులు చూసుకుంటూ వచ్చిన ఇవివి గారికి ఆర్యన్ రాజేష్, నరేష్ లు జన్మించారు. అయినా ఆయనకి సినిమాల పై ఆసక్తి తగ్గకపోవడంతో ఆయన నాన్నగారిని ఒప్పించి చెన్నై వెళ్లారు.

3) అక్కడ ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. తిండి ఉండేది కాదు.. ఎవ్వరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే లేరు. చీదరింపులు,తిట్లు ఎన్నో పడ్డారు ఇవివి గారు.

4) అయితే రాజీవ్ కనకాల గారి తండ్రి దేవదాస్ కనకాల గారు తన సినిమా ‘ఇంటి భాగోతం’ కి అసిస్టెంట్ గా ఇవివి గారిని తీసుకున్నారు. ఈయన పనితనం ఆయనకి నచ్చింది.

5)కొన్నాళ్ళకి జంధ్యాల, సురేష్ కృష్ణ వంటి అగ్ర దర్శకుల కంట్లో పడ్డారు. జంధ్యాల గారి వద్ద కొన్నాళ్ళు శిష్యరికం చేసినందుకు ఇవివి గారికి దర్శకుడిగా సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి.

6) అలా మొదటిగా 1990 వ సంవత్సరంలో ‘చెవిలో పువ్వు’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు ఇవివి గారు. ఆ సినిమా టైములో ఈయనకి మరిన్ని ఛాన్స్ లు వచ్చాయి. కానీ ‘చెవిలో పువ్వు’ సినిమా డిజాస్టర్ అయ్యింది.అప్పటి వరకు ఈయన్ని వెతుక్కుంటూ వచ్చిన నిర్మాతలు వెనకడుగు వేశారు. దీంతో ఇవివి గారు డిప్రెషన్ కు వెళ్లిపోయారు. ఓ సందర్భంలో సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయినట్టు ఆయన గతంలో చెప్పుకొచ్చారు.

7) అయితే రామానాయుడు గారు ‘ప్రేమ ఖైదీ’ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో రామానాయుడు గారు ఎప్పుడూ ముందుండేవారు. ఆయన నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిజం చేస్తూ ‘ప్రేమ ఖైదీ’ సూపర్ హిట్ అయ్యింది. పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు లాభాలను అందించింది.

8) అటు తర్వాత ‘అప్పుల అప్పారావు’ ‘సీతారత్నం గారి అబ్బాయి’ ‘జంబలకిడి పంబ’ ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ ‘వారసుడు’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ‘అబ్బాయిగారు’ ‘హలో బ్రదర్’ ‘ఆమె’ ‘అల్లుడా మజాకా’ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఇవివి గారు. కామెడీ అండ్ సెంటిమెంట్.. ఈ రెండు ఇవివి గారి సినిమాల్లో హైలెట్ అవుతుంటాయి.

9) రంభ, రవళి, రచన, ఊహ వంటి హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది ఇవివి గారే..!

10) అంతే కాదు స్టార్ డైరెక్టర్స్ అయిన వినాయక్, శ్రీను వైట్ల కూడా ఇవివి గారి శిష్యులు.

11)’ఆమె’ చిత్రానికి గాను మొదటి నంది అవార్డుని అందుకున్నారు ఇ.వి.వి గారు.

12) ఇవివి గారి ఇద్దరు కొడుకులు హీరోలుగా పరిచయమయ్యారు. వీరిలో ‘అల్లరి’ నరేష్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్యన్ రాజేష్ మాత్రం తొందరగానే ఫెడవుట్ అయిపోయాడు.

13) ఇవివి గారి కెరీర్లో.. ‘ఆయన తీసిన సినిమాల్లో మిమ్మల్ని నిరాశ పరిచిన మూవీ ఏంటి?’ అని ఆయన్ని అడిగితే.. ‘ఆరుగురు పతివ్రతలు’ అని ఆయన ఓ సందర్భంలో తెలియజేసారు. ‘ నా కెరీర్ లో నేను తీసిన చెత్త సినిమా అది. ఆ మూవీతో నేను ఓ మంచి విషయాన్ని చెబుదాం అనుకున్నాను.కానీ అది ట్రాక్ తప్పి… ఏదేదో అయిపోయింది. ఈ సినిమా ఎందుకు తీసానా అనే గిల్ట్ ఫీలింగ్ నాకు ఉంటుంది’ అని ఆయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ సినిమా పై ఎన్నో మీమ్స్ కూడా ఇప్పటికి జెనెరేట్ అవుతుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే.

14) ఇవివి గారి చివరి సినిమా ‘కత్తి కాంతారావు’. 2010 లో ఈ చిత్రం విడుదలైంది.

15)2011లో ఇ.వి.వి గారు క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. ఇవివి గారు చనిపోయే టైంకి ఆయన వయసు 54ఏళ్ళు మాత్రమే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus