Model Rajashekar: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ రాజశేఖర్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 3 వారాలు దాటింది.21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్తే.. 3 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హౌస్ లో ఇప్పుడు 18 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అయితే జనాలకు అస్సలు తెలీని మొహాల్లో రాజశేఖర్ ఒకరని చెప్పాలి. గత సీజన్లో మోడల్ కేటగిరిలో జెస్సీ ఎలాగైతే వచ్చాడో ఇప్పుడు మోడల్ కేటగిరిలో రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు. మిగిలిన కంటెస్టెంట్ల గురించి జనాలకు ఎంతో కొంత తెలుసు.కానీ మోడల్ రాజశేఖర్ గురించి జనాలకు పెద్దగా ఏమీ తెలీదనే చెప్పాలి. కాబట్టి ఇతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) ఇతని పూర్తి పేరు రాజశేఖర్ ముత్యాలు. ఇతను తెలంగాణ కుర్రాడే. తెలంగాణలోనే పుట్టి పెరిగాడు.

2) ఇతను చదువు పూర్తి అయ్యాక ఇండస్ ఇండ్ బ్యాంక్ లో పైనాన్షియల్ అడ్వైజర్ గా వర్క్ చేశాడు.

3) అటు తర్వాత సౌత్ ఇండియాలో చాలా కంపెనీలకి మోడలింగ్ వర్క్స్ చేశాడు. ఫ్లిప్ కార్ట్, స్నేహ చికెన్, బందన్ టైల్స్ లాంటి సంస్థలతో కలిసి వర్క్ చేశాడు రాజశేఖర్.

4) 2018 లో టైమ్స్ నౌ వారు నిర్వహించిన హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరిలో 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

5) అటు తర్వాత కళ్యాణ వైభోగమే, మనసంతా నువ్వే సీరియల్స్ లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి మెప్పించాడు.

6) రాజశేఖర్ కు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అలాగే వివిధ ప్రదేశాలకు వెళ్లి ఫోటో షూట్లలో పాల్గొనడం అంటే ఇతనికి ఇంకా ఇష్టం.

7) రాజశేఖర్ లో మంచి బిజినెస్ మెన్ కూడా ఉన్నాడు. నిజానికి ఇతన్ని సినిమాల్లో ట్రై చేయమని చాలా మంది కోరినా… ఇతను ఆ దిశగా అడుగులు వేయలేదు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ. ఒకవేళ తన నటన నచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినా బిజినెస్ కు ఇబ్బంది ఎదురవుతుంది అనే ఉద్దేశంతో అతను సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే తన మనసుకు నచ్చిన పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను అని కూడా తెలిపాడు రాజశేఖర్.

8) అతి తక్కువ వయసులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టాడు రాజశేఖర్. ఇతనికి ఓ సోదరి కూడా ఉంది.

9) గతంలో రాజశేఖర్ కు పెళ్లైనట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదు. అతను చేసిన ఓ ఫోటో షూట్ వల్ల అలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

10) ఇక రాజశేఖర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 24 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాకు ఇతను చాలా దూరంగా ఉంటాడు. మరి ‘బిగ్ బాస్ 6’ లో ఇతను ఎంత వరకు రాణిస్తాడో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus