బాలకృష్ణ గురించి మీకు తెలియని నిజాలు

నట సింహ నందమూరి బాలకృష్ణ తెర పైన కనిపిస్తే మాస్ ప్రేక్షకులకు పండుగే. ఆయన చెప్పే ప్రతి డైలాగ్ విజిల్స్ అందుకుంటాయి. “నీ ఇంటికొచ్చా”, ” చూడు ఒక వైపే చూడు” వంటి ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరే యాక్షన్స్ తో ఎంటర్ టైన్ చేయడానికి బాలయ్య నిరంతరం శ్రమిస్తుంటారు. నటనలోనే కాదు, సమాజ సేవలోనూ ముందుంటారు. ఆయన గురించి మరికొన్నిఆసక్తికర సంగతులు..

1.స్టార్ హీరోల వారసులు అనుభవం ఉన్న డైరక్టర్, పేరొందిన నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు పరిచయం కావడానికి ఇష్టపడుతారు. అందుకు భిన్నంగా కొత్త బ్యానర్లో, కొత్త దర్శకుని ద్వారా బాలకృష్ణ హీరోగా అడుగు పెట్టారు.

2. సామాజిక చిత్రాలు తీసే సమయంలో ఒక సైన్స్ ఫిక్షన్ కథతో ఆదిత్య 369 సినిమాను ఒప్పుకుని నట సింహ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారారు. 1991లో విడుదలైన ఈ చిత్రం గొప్ప విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించింది.

3. హైదరాబాద్లోని నిజం కాలేజీ నుంచి బాలకృష్ణ కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

4. ఫ్లాప్ సినిమాగా టాక్ తెచ్చుకున్నా ఒక వారంలో రూ. 3 కోట్లు వసూలు చేసిన చిత్రంగా “ధర్మక్షేత్రం” రికార్డ్ సృష్టించింది.

5. మహా నటుడు నందమూరి తారక రామారావు దర్శకత్వంలో బాలకృష్ణ తొలిసారి నటించారు. 1974 లో వచ్చిన తాతమ్మ కల చిత్రంలో బాల నటుడిగా చక్కని నటన ప్రదర్శించారు.

6. బాలయ్య తన 22వ యేట ఎస్ఆర్ఎంటీ చౌదరీ కుమార్తె వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నారు.

7 . గోవాలో 2012 లో జరిగిన 43వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా బాలయ్య హాజరయ్యారు.

8. పెద్దల పట్ల గౌరవంగా ఉండడం బాలకృష్ణతో వచ్చిన సంస్కారం. ఆయన సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తో కలిసి భార్య భర్తల బంధం సినిమాలో నటించారు.

9. బాలకృష్ణ సినీ పయనంలో భైరవ ద్వీపం సినిమా ఒక మైలురాయి. ఈ జానపద చిత్రంలో సాహస హీరోగా ఉత్సాహంగా నటించడమే కాదు.. ఒక దశలో కురూపిగా బాలయ్య చేసిన నటన అద్భుతం.

10. సౌత్ ఇండియా చలన చిత్ర చరిత్రలో ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్ హిట్లు పొందిన హీరో బాలకృష్ణ. 1986 లో వచ్చిన ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోర్దారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరుడు చిత్రాలు విజయవంతమయ్యాయి.

11. బాలయ్య తన 22వ యేట ఎస్ఆర్ఎంటీ చౌదరీ కుమార్తె వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నారు.

12. ఎన్టీఆర్ లాగా నందమూరి వంశంలో అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రాణించిన ఒకే ఒక్కడు బాలకృష్ణ.

13. స్టార్ హీరో సినిమాల్లో ఫైట్స్ తప్పని సరి. అవి లేకుంటే అభిమానులు నిరాశ పడుతారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య ఒక్క ఫైట్ లేకుండా “నారీ నారీ నడుమ మురారీ ” సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఈ ప్రయత్నం చేసిన తొలి స్టార్ హీరోగా బాలకృష్ణ సినీ హిస్టరీలో నిలిచాడు.

14. బాలకృష్ణ చిత్రాల్లో ఎక్కువగా 50, 100,150,175 రోజులు ఆడాయి. రెండు, మూడో తరం హీరోల్లో ఎవరి సినిమాలు బాలయ్య రికార్డ్ ని బీట్ చేయలేదు.

15. “ది లెజెండ్ ” పేరుతో ఇండియా టుడే వార పత్రిక బాలకృష్ణ పై ప్రత్యేక సంచికను విడుదల చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus