ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు సింగర్ రాహుల్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

‘కింగ్’ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్3’ నవంబర్ 3 న ఘనంగా ముగిసింది. ఈసారి ఎవరు ‘బిగ్ బాస్’ టైటిల్ గెలుచుకుంటారు అని ఎంతో ఆసక్తితో ఎదురుచూసిన వారికి సమాధానం దొరికేసింది. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు. మొదట ఈయన గెలుస్తాడు అని ఎవ్వరూ అనుకోలేదు. హౌస్ లో ఉన్న తన ఫ్రెండ్స్.. వరుణ్, వితిక,పునర్నవి వంటి వారు కూడా రాహుల్ ని నామినేట్ చేశారు. ఇక శ్రీముఖి అయితే అనుక్షణం రాహుల్ టార్గెట్ చేస్తూనే వచ్చింది. అయితే ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోకుండా స్పోర్టివ్ గా తీసుకుని సరిచేసుకోవడంతో ప్రేక్షకులు రాహుల్ కు మద్దతు పలకడం స్టార్ట్ చేశారు. ఏకంగా 52 శాతం ఓట్లు రాహుల్ కే వచ్చాయి అంటే.. అతనికి ఏ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది అర్ధమవుతుంది.

ఇక రాహుల్ గురించి మనకు తెలియని కొన్ని విషయాల్ని తెలుసుకుందాం రండి :

రాహుల్ సిప్లిగంజ్ ఒక పీపులర్ ప్లే బ్యాక్ సింగర్.. సాంగ్ రైటర్. కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా పాడాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండీ వచ్చిన రాహుల్ పక్కా హైదరాబాదీ.

యూట్యూబ్ లో కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు రాహుల్.

నాగచైతన్య హీరోగా వచ్చిన ‘జోష్’ చిత్రం ద్వారా సింగర్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు రాహుల్.

ఎన్టీఆర్ ‘దమ్ము’ సినిమాలో ‘వాస్తు బాగుందే’ సాంగ్ తో మరింత పాపులర్ అయ్యాడు రాహుల్.

పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ‘మెలికలు తిరుగుతుంటే అమ్మాయో’ సాంగ్ తో రాహుల్ కు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

రాంచరణ్ ‘రచ్చ’ సినిమాలో ‘సింగరేనుంది’ సాంగ్ సూపర్ హిట్ అయ్యి రాహుల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగ రంగ’ సాంగ్ పడడానికి కూడా చరణ్ రెఫర్ చేసాడట.

నితిన్ ‘లై’ సినిమాలో ‘బొంబాట్’ సాంగ్ అలాగే ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో ‘పెద్ద పులి’ పాటలు పాడింది కూడా రాహులే..!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో ‘బోనాలు’ పాటకి మరింత మంచి పేరు వచ్చింది రాహుల్ కి..!



ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండీ వచ్చిన రాహుల్.. ‘బిగ్ బాస్3’ విన్నర్ అయితే సెలూన్ షాప్ పెట్టుకుంటానని చెప్పాడు. అది అతని వృత్తి అని.. ఎంత ఎదిగినప్పటికీ దానిని మరచిపోను అంటూ కూడా రాహుల్ చెప్పుకొచ్చాడు. మరి రాహుల్ కు మరిన్ని అవకాశాలు దక్కాలి అని కోరుకుందాం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus