నమ్రత చెల్లి శిల్పా శిరోద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

శిల్పా శిరోద్కర్.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవ్వరికీ అర్ధం కాదు లెండి. కానీ నమ్రత చెల్లెలు అని చెబితే మాత్రం.. ‘ఓహో అవునా’ అని అంతా అనుకుంటారు. నిజానికి ఈమె కూడా ఒక మోడలే..!అటు తరువాత అనేక హిందీ చిత్రాల్లో కూడా నటించింది. అయితే ప్రముఖ బిజినెస్మెన్ అయిన ఆపరేశ్ రంజిత్ ను 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న తరువాత.. సినిమాలు తగ్గించింది. కేవలం ప్రాముఖ్యత కలిగిన పాత్రలు వస్తేనే చేస్తుంది.

అయితే శిల్పా శిరోద్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే…! మోహన్ బాబు హీరోగా బి.గోపాల్ డైరెక్షన్లో 1992 లో వచ్చిన ‘బ్రహ్మ’ అనే చిత్రంలో ఈమె ఓ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆడకపోవడంతో.. శిల్పా కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో ఈమె మళ్ళీ టాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇదిలా ఉండగా… మహేష్, నమ్రత లు సమయం దొరికినప్పుడల్లా శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీని కలుస్తూనే ఉంటారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా వారి ఇన్స్టా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు.

మొన్నామధ్య నమ్రత.. శిల్పాతో ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోకి ‘ఫైర్ అండ్ ఐస్’ అనే క్యాప్షన్ ను కూడా ఇచ్చింది. అంతేకాదు ‘మనది లైఫ్ టైం బంధం’ అంటూ ఓ ఎమోషనల్ కామెంట్ కూడా పెట్టింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఫొటోతో పాటు మహేష్ అండ్ ఫ్యామిలీ అతని మరదలి ఫ్యామిలీతో దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేసాయి. ఆ ఫోటోలను కుదిరితే మీరు కూడా ఓ లుక్కెయ్యండి :


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus