Upasana: చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉపాసన!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ మంచి బిజినెస్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈమెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టి మెగా పరువు ప్రతిష్టలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని చెప్పాలి. ఇలా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఉపాసన ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యారు. ఇక ఈమె డెలివరీకి ముందు నుంచి కూడా రామ్ చరణ్ తనకు అండగా నిలిచి తన అవసరాలన్నింటినీ ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ వచ్చారు..

ఇక ఉపాసన జూన్ 20వ తేదీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా కుమార్తె పుట్టిన తర్వాత ఉపాసన ఇంటికి పరిమితమై తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నారు. అయితే పాప పుట్టిన తర్వాత మొదటిసారి ఉపాసన మీడియా ముందుకు వచ్చారు.. అపోలో హాస్పిటల్స్ నిర్వహించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉపాసన పాల్గొని చిన్నపిల్లల కోసం ఫ్రీ కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉపాసన (Upasana) మాట్లాడుతూ… పేరేంటింగ్ ఎంతో ముఖ్యమైన విషయం పిల్లల పెంపకంలో నాకు ఎప్పుడు సాయం చేసే భర్త ఉన్నందుకు తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ చరణ్ వ్యక్తిత్వం పై అలాగే అతనిపై ఈమెకు ఉన్నటువంటి ప్రేమ గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇక తన కుమార్తె గురించి కూడా ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడారు క్లిన్ కారా పుట్టిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం నేను చాలా ఆనందంగా ఉన్నాను.తన కుమార్తె వచ్చిన తర్వాత జీవితం విలువ ఏంటో తనకు తెలిసేలా చేసింది అంటూ ఈ సందర్భంగా ఉపాసన తన భర్త గురించి తన కుమార్తె గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus