రాశీ ఖన్నా కెరీర్ మైలేజీ పెంచే చిత్రాలు

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా తొలి విజయంతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. సాయి ధరమ్ తేజ్ సుప్రీం లో పోలీస్ గా రాశీ నవ్వించి.. కవ్వించి సినిమా అవకాశాలను బుట్టలో వేసుకుంది. జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. దీంతో స్టార్ హీరోయిన్ హోదా అందుకొని దూసుకుపోతోంది. తెలుగులో రెండు సినిమాలు, తమిళ, మలయాళ భాషల్లో మూడు సినిమాలు చేస్తోంది. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా చేస్తోన్న “సైతాన్ క బచ్చా”తో పాటు “ఇమ్మక్కా నోడగల్ ” లో నటిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ “విలన్” సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసింది. ఇవి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తెలుగులో రాశీ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.

మాస్ మహారాజ్ రవితేజతో కలిసి రెండో సారి నటించిన “టచ్ చేసి చూడు” ఫిబ్రవరి 2 న రిలీజ్ కానుంది. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచింది. వారం గ్యాప్ లోనే రాశీ హీరోయిన్ గా నటించిన మరో మూవీ తొలిప్రేమ విడుదల కానుంది. ఇందులో రాశీ ఖన్నా బబ్లీ రోల్ పోషించింది. గెటప్ కొత్తగా ఉంది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా నిజమైతే మరి కొన్నేళ్లు రాశీ ఖన్నా టాలీవుడ్ లో కొనసాగడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus