పాండమిక్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలకు వందల కోట్ల ఆఫర్ ఇస్తున్నాయి ఓటీటీ సంస్థలు. మధ్యలో థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ వైపు చూశాయి. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారాయి. దీంతో ఓటీటీ సంస్థలు పెద్ద సినిమాలకు గాలం వేస్తున్నాయి. ఒక్కో సినిమాకి వంద కోట్లకు పైగా ఆఫర్ చేస్తూ.. నిర్మాతలను టెంప్ట్ చేస్తున్నాయి.
రీసెంట్ గా ‘రాధేశ్యామ్’ సినిమాకి భారీ ఓటీటీ ఆఫర్ వచ్చిందని అనగానే.. ఓటీటీలో రిలీజ్ అవుతుందేమోనని అభిమానులు టెన్షన్ పడ్డారు. థియేటర్ సమస్యలు ఇలానే కొనసాగితే నిర్మాతలు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు వచ్చిన ఓటీటీ ఆఫర్లు ఎంతో ఇప్పుడు చూద్దాం!
రాధేశ్యామ్ – రూ.400 కోట్లు
లైగర్ – రూ.200 కోట్లు
భీమ్లానాయక్ – రూ.150 కోట్లు
ఆర్ఆర్ఆర్ – రూ.500 కోట్లు
కేజీఎఫ్ 2 – రూ.255 కోట్లు
వాలిమై – రూ.300 కోట్లు
విక్రాంత్ రోనా – రూ.100 కోట్లు
ఆచార్య – రూ.150 కోట్లు
పొన్నియన్ సెల్వన్ – రూ.300 కోట్లు
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!