ఓ పాన్ ఇండియా సినిమాని విడుదల చేయాలి అంటే.. అన్ని భాషల్లోనూ సోలో రిలీజ్ దక్కుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా చేయడం వలన మంచి ఓపెనింగ్స్ వస్తాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే దానికి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం నమోదు కాలేదు. దర్శకధీరుడు రాజమౌళి మాత్రం ఇలాంటి తప్పు చేయడు. కాస్త ఆలస్యం అయినప్పటికీ.. అన్ని భాషల్లోనూ వారం రోజుల పాటు వేరే సినిమా రిలీజ్ కాని టైంలోనే తన సినిమాని రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తుంటాడు.
ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అవే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ చిత్రాన్ని నిజంగానే అక్టోబర్ 13న రిలీజ్ చేస్తాడా? అనేది సందేహమే అని ఇండస్ట్రీలో చాలా మంది అంటున్నారు. ఈ సందేహం సుకుమార్ లాంటి దర్శకుల్లో కూడా ఉంది. అందుకోసమే సుకుమార్ తన ‘పుష్ప’ చిత్రం విడుదలను 2022 లో ప్లాన్ చేసుకుంటున్నాడు. నిజానికైతే ‘పుష్ప’ చిత్రాన్ని ఆగష్ట్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాడు.
కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. అటు తర్వాత క్రిస్మస్ కు ‘పుష్ప’ ని విడుదల చేయాలని ప్లాన్ చేసాడు. అయితే ఇప్పుడు ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలకు షూటింగ్ నిర్వహించడం కుదరడం లేదని వినికిడి. ఇంకా ఈ ‘పుష్ప’ పార్ట్ 1 కి సంబంధించి 45 రోజుల షూటింగ్ వర్క్ బాలన్స్ ఉంది.