ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం అసాధారణమైన కలెక్షన్లను నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. డెబ్యూ హీరోల్లో అత్యథిక కలెక్షన్లను రాబట్టిన హీరోగా ఆల్రెడీ ఓ రికార్డు సృష్టించాడు. అతనికి మొదటి చిత్రంతోనే మంచి మార్కెట్ ఏర్పడింది.తరువాత చెయ్యబోయే సినిమాలు కూడా బాగా ప్లాన్ చేసుకుంటే.. అల్లు అర్జున్ లా స్టార్ హీరో అయిపోయే అవకాశం ఉంది. హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఈ చిత్రం బాగా ప్లస్ అయ్యింది. ఆమెకి కూడా ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి..
భవిష్యత్తులో ఆమె కూడా స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ‘ఉప్పెన’ చిత్రం రిలీజైన 4 రోజులకే రూ.32 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఈ ఏడాది అత్యథిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా ఇప్పటివరకూ ‘క్రాక్’ ఉండగా.. ఇప్పుడు ఆ చిత్రం వసూళ్లను అధిగమించే దిశగా ‘ఉప్పెన’ దూసుకుపోతుంది. ‘క్రాక్’ చిత్రం రూ.37కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ‘ఉప్పెన’ చిత్రం మరో 2 రోజుల్లో ‘క్రాక్’ వసూళ్లను మించే అవకాశం ఉంది.
అయితే ‘క్రాక్’ చిత్రం విడుదల అయ్యే టైంకి కేవలం 50శాతం ఆకుపెన్సీతో మాత్రమే థియేటర్లు రన్ అయ్యేవి. పైగా పక్కన పోటీగా మరో 3 సినిమాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ‘క్రాక్’ సినిమాకి కూడా 100 శాతం సీటింగ్ కెపాసిటీ బెనిఫిట్ ఉండి ఉంటే.. ఆ చిత్రం మరింత ఎక్కువగా కలెక్ట్ చేసి ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ చిత్రానికి సోలో రిలీజ్ దక్కడం అలాగే 100శాతం సీటింగ్ కెపాసిటీతో పాటు టికెట్ రేట్లు పెంచడం కూడా ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?