కారణాలేమైనా కానీ.. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా భారీగా ట్రోలింగ్‌కి గురవుతున్న నటీమణుల్లో ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈ క్రమంలో ఆమె చాలా రోజుల నుండి తనపై జరుగుతున్న ట్రోలింగ్, కామెంట్ల ద్వారా జరుగుతున్న మాటల దాడిని.. ఆమె స్క్రీన్‌షాట్ల రూపంలో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆమె ఈ ట్రోలింగ్ గురించి మాట్లాడింది. ఏకంగా కొంతమంది తననను రేప్ చేస్తా అంటూ కామెంట్లు చేస్తున్నారని, వారి వదిలేయాలా అని ప్రశ్నించింది ఉర్ఫీ జావేద్.
సోషల్ మీడియాలో ఆకతాయిల వేధింపుల సమస్య చాలా రోజుల నుండి ఉంది. ఇలాంటి వేధింపులకు బాలీవుడ్ యువ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ కూడా బాధితురాలే. ట్రోల్స్, రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్న వ్యక్తుల గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో ‘‘ఇండియాలో సైబర్ చట్టాలు సరిగా లేవు. కంప్లైంట్స్ ఇచ్చినా సరైన స్పందన ఉండటం లేదు. దీంతో ప్రజలు కూడా కంప్లైంట్లు ఇవ్వడం మానేస్తున్నారు’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది ఉర్ఫీ.
అంతేకదు ‘‘ఆకతాయిలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతుండటంతో ఓపెన్‌గానే అమ్మాయిల్ని తిడుతున్నారు, వేధిస్తున్నారు. ఏకంగా రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. మనం ఈ విషయాన్ని ఎందుకు వదిలేయాలి?’’ అని ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసింది. అయితే ఆమె ఈ రేప్ బెదిరంపుల గురించి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఇలాంటి బెదిరింపులు రావడం, వాటిని ఆమె నెటిజన్ల దృష్టికి తీసుకురావడం జరిగింది.
రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసినప్పుడు… ఆయనపై కేసు నమోదు అయ్యింది. అప్పుడు కొంతమంది ఉర్ఫీ జావేద్ హాట్ ఫోటో షూట్స్ గురించి మాట్లాడారు. ఇటువంటి కేసులు, మనోభావాల విషయంలో లింగ వివక్ష చూపించకూడదు అంటూ ఉర్ఫీని ఈ చర్చలోకి లాగారు. ‘‘న్యూడ్ ఫోటో షూట్ వివాదంలోకి నన్ను లాగకుండా రణ్‌వీర్ సింగ్‌కి సపోర్ట్ చేయొచ్చు. ఫొటో షూట్‌ల విషయంలో నేనూ ట్రోలింగ్ ఎదుర్కొన్నాను. నన్ను కొందరు రేప్ చేస్తామని బెదిరించారు, చంపేస్తామన్నారు’’ అని ఉర్ఫీ గతంలో చెప్పుకొచ్చింది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?