‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించిన ‘యూరి సర్జికల్ స్ట్రైక్’..!

బాలీవుడ్ లో ఏ చిత్రానికైనా హిట్ టాక్ వస్తే… మొదటి వారం పూర్తయ్యే వరకూ మంచి కలెక్షన్లు నమోదు చేస్తాయి.. తరువాత కూడా ఆ జోరు కొనసాగించినా.. మొదటి వారానికి మించి కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంటుందనేది చెప్పలేము. ఒక్క బాహుబలి 2 చిత్రం మాత్రమే ఇప్పటివరకూ ఇండియాలో ఏ సినిమాకు రాని స్థాయిలో కలెక్షన్స్ ని నమోదు చేసింది. దాదాపు 30 రోజుల వరకూ ఈ చిత్రం కలెక్షన్ల జోరు తగ్గలేదు. అలా ‘బాహుబలి 2’.. కలెక్షన్ల విషయంలో ట్రెండ్ సృష్టించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ఓ ‘బాహుబలి2’ రికార్డ్ ను ‘యూరి యూరి సర్జికల్ స్ట్రైక్’ ను బ్రేక్ చేసింది.

‘బాహుబలి2’ విడుదలైన 20 రోజుల తరువాత కూడా కలెక్షన్స్ 8 కోట్లకు తగ్గలేదు. ఇక 23వ రోజు(6.35కోట్లు) అలాగే 24వ రోజులో(6.53కోట్లు) అందుకున్న కలెక్షన్స్ ని యూరి:ద సర్జికల్ స్ట్రైక్ బీట్ చేసి ట్రేడ్ వర్గాలకి సైతం షాకిచ్చింది. ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. ‘యూరి’ 23వ రోజున ఈ చిత్రం 7.80కోట్లు, 24వ రోజు 8.71కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఇప్పటివరకూ ఇంత లాంగ్ రన్లో.. ఈ స్థాయి కలెక్షన్స్ అందుకున్న సినిమా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ‘యూరి’ కంటెంట్ బాగా నచ్చడంతో జనాలు బ్రహ్మరధం పట్టారు. ఇక ఇప్పటికే ఈ చిత్ర కలెక్షన్స్ 200 కోట్ల మార్క్ కి దగ్గరవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఏడాది మొదటి ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిట్ గా ‘యూరి’ చిత్రం సంచలనం సృష్టించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus