Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కేసులో ఈడీ అధికారులు ఇన్వాల్వ్ అయిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్..లను ప్రమోట్ చేస్తున్న సినిమా సెలబ్రిటీలను, సోషల్ మిడిల్ సెలబ్రిటీలపై మనీ లాండరింగ్ కేసుల్లో నిందితులుగా భావించి వారిని విచారిస్తూ వస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపి మిమి చక్రవర్తి, రానా, విజయ్ దేవరకొండ,సురేష్ రైనా, శిఖర్ ధావన్ వంటి వాళ్ళను విచారించడం జరిగింది. 2 వారాల క్రితం నటి ఊర్వశి రౌటేలాకు (Urvashi Rautela) కూడా ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు.

Urvashi Rautela

1Xbet యాప్ ను ఆమె ప్రమోట్ చేసినందుకు గాను.. ఈడీ అధికారులు నోటీసులు పంపడం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 16నే ఊర్వశి రౌటేలా విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ టైంలో హాజరుకాకపోవడంతో ఆమె ఈరోజు అనగా సెప్టెంబర్ 30న హాజరైనట్టు తెలుస్తుంది.

ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయానికి ఆమె వెళ్లగా.. దాదాపు 4 గంటల పాటు.. ఆమెను విచారించారట అధికారులు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని.. అప్పటివరకు రాష్ట్రం దాటి వెళ్లాల్సి వస్తే.. ముందుగా ఇన్ఫార్మ్ చేయాలనీ ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. తర్వాత ఊర్వశి మీడియాతో మాట్లాడేందుకు కూడా నిరాకరించినట్టు టాక్.

బాలీవుడ్లో పలు సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె తక్కువ టైంలోనే రూ.100 కోట్లకు పైగా ఆస్తి సంపాదించింది. ఖరీదైన బంగ్లా,కార్లు ఆమె పేరిట ఉన్నాయి. సినిమాల్లో ఆమె చేసే స్పెషల్ సాంగ్స్ కి కోట్లల్లో చెల్లిస్తున్నారు నిర్మాతలు. ‘బ్రో’ ‘స్కంద’ ‘వాల్తేరు వీరయ్య’ ‘డాకు మహారాజ్’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగులో కూడా పాపులర్ అయ్యింది ఊర్వశి రౌటేలా.

కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus