రచయితగా ఎన్ని హిట్ కథలు ఇచ్చినా… దర్శకుడిగా విజయం అందుకోని వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటివారిలో వక్కంతం వంశీ ఒకరు. మాస్ మసాలా ఎంటర్టైనర్లు రాయడంతో దిట్ట అయిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి ‘నా పేరు సూర్య’ చేశారు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తాపడింది. దీంతో మళ్లీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ డైరక్షన్ చేయబోతున్నారు. దాని కోసం గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయిందట.‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాల తర్వాత నితిన్ త్వరలో ‘మాస్ట్రో’తో రాబోతున్నాడు.
వరుస పెట్టి ప్రయోగాలు, సాఫ్ట్ సినిమాలు ఎందుకు అనుకున్నాడేమో… ఈసారి మాస్ మసాలా సినిమా చేయాలని చూస్తున్నాడట. దీని కోసం కథలు వింటున్నాడు. అందులో భాగంగానే వక్కంతం వంశీ కథ విన్నాడట. ఆలోచన నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఓవైపు వక్కంతం వంశీ పవన్ కల్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు కథ అందిస్తున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్ నితిన్‌కి దర్శకత్వం వహించబోతున్నాడన్నమాట.
నితిన్ ఈ సినిమాకు ముందుకురావడంతో గతంలో ఒప్పుకున్న ‘పవర్‌పేట’ ఆగిపోయినట్లే అనే వార్తలొస్తున్నాయి. దీంతో కృష్ణ చైతన్య మరో హీరోను చూసుకోవాల్సిందే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!