Vakkantham Vamsi: ఆ విమర్శల గురించి క్లారిటీ ఇచ్చిన వక్కంతం వంశీ.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ రైటర్లలో వక్కంతం వంశీ ఒకరు కాగా ఒకవైపు రైటర్ గా పని చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా వక్కంతం వంశీ కొనసాగుతున్నారు. అయితే ఈ రైటర్ సినిమాలకు అందించిన కొన్ని కథలు కాపీ అనే ఆరోపణలు వినిపించగా ఆ ఆరోపణల గురించి వక్కంతం వంశీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అశోక్ సినిమాకు కథ అందించగా ఆ సినిమా సోసోగా ఆడిందని వక్కంతం వంశీ కామెంట్లు చేశారు.

అశోక్ సినిమాకు రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. అతిథి మూవీ సురేందర్ రెడ్డి సొంత కథతో తెరకెక్కిందని ఆ సినిమా సిట్టింగ్స్ కు కూడా నేను హాజరయ్యానని ఆయన వెల్లడించారు. కిక్ సినిమా తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ఈ సినిమా నాకు ధైర్యాన్ని ఇచ్చిందని వక్కంతం వంశీ అన్నారు. రైటింగ్ విషయంలో సీరియస్ గా ఉండవచ్చని ఈ మూవీ ప్రూవ్ చేసిందని ఆయన తెలిపారు.

సురేందర్ రెడ్డి గారితో ఎక్కువ సినిమాలు చేశానని వక్కంతం వంశీ వెల్లడించారు. సురేందర్ రెడ్డి మంచి ఫ్రెండ్ అని ఆయన కామెంట్లు చేశారు. నా సినిమాలు ఇంగ్లీష్ సినిమాలను పోలి ఉంటాయని విమర్శ ఉందని ఆయన వెల్లడించారు. కిక్ సినిమా జెంటిల్ మేన్ సినిమా నుంచి స్పూర్తి పొందానని అడుగుతారని ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాదని వక్కంతం వంశీ పేర్కొన్నారు.

కిక్ సినిమాకు, జెంటిల్ మేన్ సినిమాకు సంబంధం లేదని ఆయన అన్నారు. మరి కొందరు ధూమ్ అన్నారని వక్కంతం వంశీ వెల్లడించారు. ప్రపంచంలో లేనిది ఊహించలేరని ఎవడు మూవీ ఫేస్ ఆఫ్ అన్నారని వక్కంతం వంశీ పేర్కొన్నారు. రేసుగుర్రం కొత్త కథ కాదని ఆ మూవీ అన్నాదమ్ముల కథ అని ట్రీట్ మెంట్ పరంగా మాత్రమే ఆ సినిమా కొత్తదని ఆ మూవీ అద్భుతం అని నేను చెప్పలేదని వక్కంతం వంశీ చెప్పుకొచ్చారు. వక్కంతం వంశీ (Vakkantham Vamsi) చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus