కోలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కూడా ఉన్నారు.రజినీ కాంత్, విజయ్ ల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్నది అజిత్ కే అన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మాత్రం ఈయనకి పెద్ద మార్కెట్ లేదు. ఇప్పుడిప్పుడే కొంత ఏర్పడుతుంది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వలీమై’ ఫిబ్రవరి 24న రిలీజ్ అయ్యి చాలా వరకు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.అదిరిపోయే బైక్ రేస్ లు, యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకులకి ఓ విజువల్ ఫీస్ట్ లా అనిపించే ఫీలింగ్ ను కలిగించింది.
దాంతో తెలుగులో కూడా ‘వలీమై’ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ లభించాయి. రెండో రోజున ‘భీమ్లా’ ఎంట్రీతో కొంత డల్ అయ్యింది కానీ మొత్తంగా ఓకె అనిపించింది.
ఒకసారి 2 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.32 cr
సీడెడ్
0.16 cr
ఉత్తరాంధ్ర
0.15 cr
ఈస్ట్
0.10 cr
వెస్ట్
0.09 cr
గుంటూరు
0.09 cr
కృష్ణా
0.08 cr
నెల్లూరు
0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.05 cr
‘వలీమై’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.2.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.05 కోట్ల షేర్ ను నమోదు చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.45 కోట్ల షేర్ ను రాబట్టాలి.మొదటి రోజు బాగానే రాణించింది.రెండో రోజు భీమ్లా ఎంట్రీతో కొంత డల్ అయినా పర్వాలేదనిపించింది. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకుంటేనే అవకాశం ఉంటుంది. శని, ఆది వారాలు ‘వలీమై’ కి కీలకం కానున్నాయి.