Jr NTR: తారక్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వల్లభనేని వంశీ!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్న తారక్ గురించి ఈ మధ్య కాలంలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొలిటికల్ విషయాలకు సంబంధించి ఈ వివాదాలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. అయితే తారక్ ఈ కామెంట్ల గురించి స్పందించకపోయినా తారక్ సన్నిహితుడైన వల్లభనేని వంశీ నెగిటివ్ కామెంట్ల గురించి స్పందించారు. తారక్ స్వయంకృషితో పైకి వచ్చారని తారక్ ను ఎవరూ పైకి తీసుకురాలేదని వల్లభనేని వంశీ వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి అనేక అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రహస్యాలను చెబితే ఎవరూ నిద్రపోరని ఆయన చెప్పుకొచ్చారు. తారక్ పెళ్లితో పాటు తారక్ కు సంబంధించిన చాలా విషయాలలో ఎవరి పాత్ర లేదని ఆయన కామెంట్లు చేశారు. 2009 సంవత్సరంలో తారక్ టీడీపీ తరపున ప్రచారం చేసినా తారక్ ను కరివేపాకులా వాడుకుని వదిలేశారని వల్లభనేని వంశీ అన్నారు. ప్రస్తుతం తారక్ సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ ను తాను చూసుకుంటున్నాడని వల్లభనేని వంశీ అన్నారు.

అమరావతితో తారక్ కు సంబంధం ఏమిటని తారక్ పై అనవసరంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని ఆయన కామెంట్లు చేశారు. ప్రతి సమస్యకు సంబంధించి తారక్ ను లాగవద్దని ఆయన అన్నారు. వల్లభనేని వంశీ చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. తారక్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే దృష్టి పెట్టారు.

పొలిటికల్ గా యాక్టివ్ కావాలని తారక్ భావించడం లేదు. రాజకీయాల విషయంలో తారక్ మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకక్కనున్నాయి. గత సినిమాల సక్సెస్ తో తారక్ రెమ్యునరేషన్ సైతం భారీగా పెరిగింది. కొరటాల సినిమాలో తారక్ కు జోడీగా నటించే బ్యూటీ ఎవరో క్లారిటీ రావాల్సిఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus