వరుణ్ టార్గెట్ ఈజీనే.. కానీ..!

  • October 9, 2019 / 09:51 PM IST

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 20 న విడుదల కాబోతుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. అక్కడ బాబీ సింహ పోషించిన నెగిటివ్ రోల్ ను ఇక్కడ వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి స్పందన లభించడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

నైజాం 7.40 cr
ఉత్తరాంధ్ర 2.40 cr
ఈస్ట్ 1.60 cr
వెస్ట్ 1.10 cr
కృష్ణా 1.60 cr
గుంటూరు 1.80 cr
నెల్లూరు 0.75 cr
సీడెడ్ 3.35 cr
ఏపీ + తెలంగాణ 20 cr
కర్ణాటక 1.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
ఓవర్సీస్ 3.5 cr
వరల్డ్ వైడ్ టోటల్ 25 cr

ఇక ‘వాల్మీకి‘ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయివాల్మీకి’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే  25 కోట్ల షేర్ వరకూ రాబట్టాల్సి ఉంది. వరుణ్ తేజ్ కు ఎలాగు మంచి మార్కెట్ ఉంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రాన్ని పెద్ద మొత్తంలో 3.5 కోట్లకు అమ్మారు. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1 మిలియన్ పైనే రాబట్టాల్సి ఉంది. అయితే హరీష్ శంకర్ సినిమాలకి అక్కడ పెద్ద మార్కెట్ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మంచి రివ్యూలు, రేటింగ్ లు వస్తేనే ఆ ఫీట్ సాధ్యం అవుతుందని చెప్పాలి.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus