అక్కినేని కోడలి ఆస్తి విలువ ఎంతంటే…?

2010 ఫిబ్రవరి 26 న విడుదలైన ‘ఏమాయ చేసావే’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యింది సమంత. గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంతో టాలీవుడ్ ని నిజంగానే మాయ చేసింది. ఈ చిత్ర హీరో అయిన నాగ చైతన్యనే వివాహం చేసుకుని స్థిరపడింది. అక్కినేని కోడలైన తరువాత మరింత క్రేజ్ పెంచుకుంది సమంత. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సమంత అగ్ర హీరోయిన్ గా రాణిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న సమంత ఆస్తుల వివరాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

సినిమాలతో పాటూ ‘బ్రాండ్ ప్రమోషన్స్’… రకరకాల డీల్స్ రూపంలో సమంత ఇప్పటివరకూ 100 కోట్ల వరకూ ఆస్తుల్ని సంపాదించిందట. పెళ్ళైన తరువాత కూడా సమంత తెలుగు, తమిళ్ తో కలిపి ఏడాదికి 3 లేదా 4 సినిమాల్లో నటిస్తుంది. ఒక్కో సినిమాకి దాదాపు 3 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటుందని తెలుస్తుంది. అంటే దాదాపు 12 కోట్లు. ఇక బ్రాండ్ ప్రమోషన్స్ కలుపుకుని ఏడాదికి దాదాపు 8 నుండీ 10 కోట్ల వరకూ సంవత్సరం ఆదాయం ఉంటుందట. ఇప్పటికే దాదాపు 45 చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ఉండగా… మరో మూడు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయట. తన భర్త నాగచైతన్య హీరోగా చేస్తున్న ‘మజిలీ’ చిత్రంతో పాటు `ఓ బేబి: ఎంత సక్కగున్నావే` వంటి చిత్రాలలో నటిస్తుంది. ఇంకా చాలా ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని సమాచారం. ఇక హైదరాబాద్ లో సమంత సొంత ఇంటి విలువ 10 కోట్లు ఖరీదు చేస్తుందట. ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి… ఇందులో ‘జాగ్వార్ ఎక్స్ఎఫ్’ కార్ -62 లక్షలు, ‘ఆడి క్యూ’ 7- 70లక్షలు, పోర్చ్ కార్ -1.15 కోట్లు. ఇంకా ఖరీదైన అపార్ట్ మెంట్లు – విల్లాలు ఎన్నో ఉన్నాయని సమాచారం. ఇక కొన్ని సందర్భాలలో ఇండస్ట్రీ అగ్ర నిర్మాతలు సమంతకి పారితోషికానికి బదులుగా అపార్ట్ మెంట్లు కట్టబెట్టారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఇక తన వ్యక్తిగత వర్కర్లకు వేలు – లక్షల్లో పారితోషికాలు చెల్లిస్తుంది. ఇక మొత్తం మీద ఇప్పటి వరకూ సమంతకి 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇంకో ఐదేళ్లు అగ్రతారగా కొనసాగితే… మరో 100 కోట్లు సంపాదించినా ఆశ్చర్యపడనక్కర్లేదు… అందులోనూ అక్కినేని కోడలు కాబట్టి అది ‘కేక్ వాక్’ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus