Vamsi, Vijay: మరోసారి కలవనున్న రూ. 300 కోట్ల కాంబో.. కామెంట్స్‌ వైరల్‌!

విజయ్‌ – వంశీ పైడిపల్లి – దిల్‌ రాజుల సినిమా ‘వరిసు’ / ‘వారసుడు’ హిట్టా? బంపర్‌ హిట్టా? బ్లాక్‌ బస్టరా? ఫట్టా? ఈ ప్రశ్నలతో ఓ వైపు చర్చ జరుగుతున్న సమయంలో మరో విషయం బయటకు వచ్చింది. అదే హీరో – డైరక్టర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా. అవును మీరు చదివింది నిజమే. విజయ్‌ – వంశీ కలసి మరో సినిమా చేస్తారు అని అంటున్నారు. వినడానికి కాస్త కొత్తగా అనిపించినా.. ఆ కాంబో మళ్లీ కుదిరింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే స్టార్ట్‌ అని కూడా అంటున్నారు.

సంక్రాంతికి ముందు ‘వరిసు’గా సంక్రాంతి తర్వగా ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్‌. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన తొలి తమిళ చిత్రమిది. ఈ సినిమాకు వచ్చిన ఫలితం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఆ కథ, కాన్సెప్ట్‌ ఫ్యాన్స్‌కు నచ్చలేని తమిళనాట మాటలు వినిపించాయి. తెలుగులో అయితే అంతేమీ లేదు అనే మాటలు వినిపించాయి. అయితే వసూళ్ల వివరాలు మాత్రం భారీగా ఉన్నాయి. సినిమా కోసం రూ. 300 కోట్ల పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. దీంతో విమర్శలు, కామెంట్స్‌, సెటైర్లు పేలాయి.

అవన్నీ పక్కన పెట్టేసి మళ్లీ ఈ ముగ్గురి కలయికలో మరో సినిమాకు ప్లాన్‌ రెడీ అయిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయినట్లు భోగట్టా. వంశీ ప్రస్తుతం పూర్తి స్థా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. విజయ్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ ‘లియో’ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ఉంటుందని టాక్‌. అయితే ‘లియో’ తర్వాత అట్లీ సినిమా ఉంటుందని తొలుత వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు వంశీ సినిమా అంటున్నారు.

అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. తొలి సినిమాతోనే ఇన్ని ఇబ్బందులు, సెటైర్లు, మీమ్స్‌ వచ్చినా.. విజయ్‌ తెలుగు ప్రమోషన్స్‌కి రాకపోవడంపై విమర్శలు వచ్చినా మళ్లీ ఈ ముగ్గురూ కలవడం గ్రేటే అంటున్నారు నెటిజన్లు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus