టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా గుర్తింపు పొందిన వారిలో వంశీ పైడిపల్లి కూడా ఒకరు. మున్నా, ఎవడు, బృందావనం, ఊపిరి వంటి సినిమాలకు దర్శకుడుగా పనిచేసి మంచి గుర్తింపు పొందిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ నటించిన వరీసు సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా తెలుగు తమిళ్ భాషలలో తెరకెక్కించారు. తాజాగా తమిళ భాషలో ఈ సినిమాని విడుదల చేయగా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.
ఇక తెలుగులో జనవరి 14వ తేదీన విడుదల చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల చేసిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. భార్య తల్లి తండ్రి తో కలిసి వంశీ పైడిపల్లి ఈ సినిమాని చూశారు.
ఈ సినిమాలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమా చూసిన వంశీ పైడిపల్లి తండ్రి చాలా ఎమోషనల్ అయ్యారు. సినిమా పూర్తి అయిన వెంటనే తన కొడుకుని గట్టిగా హత్తుకున్నాడు. తన కొడుకు గొప్ప స్థాయికి ఎదిగాడని వంశీని అభినందిస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని వంశీ పైడిపల్లి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
” నా జీవితంలో అసలైన విజయం ఇప్పుడు సాధించాను. నేను దర్శకత్వం వహించిన వారసుడు సినిమా చూసి నా తండ్రి ఎంతో ఆనందించాడు. జీవితంలో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాను, ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. నువ్వే నా రియల్ హీరో నాన్నా” అంటూ వంశీ పైడిపల్లి రాసుకొచ్చాడు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?