‘వెంకీమామ’ థాంక్యు మీట్ లో వంశీ పైడిపల్లి సంచలన కామెంట్లు.!

  • December 17, 2019 / 05:36 PM IST

‘మున్నా’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. ఆ చిత్రం పెద్ద సక్సెస్ సాధించకపోయినా.. డైరెక్టర్ వంశీ ఎఫర్ట్ కు మంచి పేరే వచ్చింది. దీంతో రెండో సినిమాని ఎన్టీఆర్ వంటి స్టార్ తో చేసే అవకాశం దక్కించుకుని సాలిడ్ హిట్ కొట్టాడు వంశీ. ఆ తరువాత రాంచరణ్ తో ‘ఎవడు’ వంటి మాస్ హిట్ అందుకున్న వంశీ.. నాగార్జున, కార్తీ లతో ‘ఊపిరి’ వంటి ఫీల్ గుడ్ మూవీని కూడా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు వంశీ పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ ఏడాది మహేష్ బాబు 25 వ చిత్రం ‘మహర్షి’ చిత్రాన్ని తెరకెక్కించి.. మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు మరోసారి మహేష్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా.. సడెన్ గా వంశీకి ఎవరి పై కోపం వచ్చిందో తెలీదు కాని.. తాజాగా జరిగిన ‘వెంకీమామ’ థాంక్యు మీట్ లో దర్శకుడు బాబీ ని ప్రశంసిస్తూ.. కమర్షియల్ సినిమా అంటే అందరికీ కామెడీ అయిపొయింది అంటూ సంచలన కామెంట్లు చేసాడు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ” ‘వెంకీమామ’ టీం అందరికీ కంగ్రాట్యులేషన్స్. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కమర్షియల్ ఎంటర్టైనర్స్ ను తక్కువ అంచనా చేసే రోజులు వచ్చేసాయి. ఎక్కడ చూసినా కమర్షియల్ ఎంటెర్టైనరే కదా అని చాలా ఈజీగా అనేస్తున్నారు. ఇప్పట్లో ఓ కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టడం అంత ఈజీ కాదు. వీటికి ఒక్క జోనర్ అంటూ ఉండదు… మా కర్మ కాలి అన్ని జోనర్లు ఉండాలి. అది యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అది భయపెట్టడం కావచ్చు, థ్రిల్స్ కావచ్చు.. అలా టాప్ టు బాటమ్ అన్ని కలిసి ఉండేలా చూసుకోవాలి..” అంటూ చెప్పుకొచ్చాడు.


వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus