అఖిల్ ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా..?
- March 18, 2016 / 11:44 AM ISTByFilmy Focus
అఖిల్ రెండవ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లితో ఉండవచ్చనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ్ చెప్పిన మాటలు, ఈ వార్తకి మరింత బలాన్ని ఇస్తున్నాయి. తన తాజా చిత్రం ‘ఊపిరి’ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగ్ తన కొడుకు అఖిల్ తదుపరి సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేశాడు.
‘ఇంకా అఖిల్ సినిమా గురించి ఒక నిర్ణయానికి రాలేదనీ, అయితే అఖిల్ మాత్రం దర్శకుడు వంశీ పైడిపల్లితో డిస్కషన్స్ జరుపుతున్నాడని’ నాగ్ చెప్పుకొచ్చాడు. ‘ఊపిరి’ సినిమా షూటింగులో వంశీ పైడిపల్లి పనితీరు నచ్చి, ఆయనకి అఖిల్ రెండవ సినిమా బాధ్యతలను నాగ్ అప్పగించారనే వార్త ఆ మధ్య షికారు చేసింది. తాజాగా నాగ్ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఈ కాంబినేషన్ సెట్ అయిందనే చెప్పుకొంటున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















