మహేష్ ని డైరక్ట్ చేయనున్న వంశీ

నేటి కమర్షియల్ తెలుగు కథలకు విభిన్నంగా ఊపిరి సినిమాను తెరకెక్కించి అందరితో అభినందనలు అందుకున్న డైరక్టర్ వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. దీంతో వంశీ టేకింగ్ ని మెచ్చుకున్నారు. అతనితో సినిమా చేయడానికి ఆసక్తి కనబరిచారు.

ఈ అవకాశాన్ని వదులుకోకూడదని వంశీ మంచి కథను మహేష్ కి వినిపించారు. ఆ స్టోరీ నచ్చడంతో డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీ ఓ వైపు అఖిల్ రెండో సినిమాకు కథ చర్చల్లో పాల్గొంటూనే.. మహేష్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసారు. సూపర్ స్టార్ విహారి యాత్రలకు వెళ్ళే ముందు వంశీ స్క్రిప్ట్ పై చర్చించారని, మురుగ దాస్ సినిమా తర్వాత ఈ సినిమా చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఊపిరి, బ్రహ్మోత్సవం సినిమాలను నిర్మించిన పీవీపీ సంస్థ నిర్మాణ భాద్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus