Varalaxmi Sarathkumar: మరోసారి పెళ్లి గురించి ఊహించని కామెంట్స్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్!

వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికీ సుపరిచితమే. సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు. తమిళంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. అయితే తెలుగులోనే బాగా క్లిక్ అయ్యింది. ‘క్రాక్’ ‘నాంది’ ‘యశోద’ ‘వీరసింహారెడ్డి’ ఇలా తెలుగులో ఈమె నటించిన సినిమాలు అన్నీ హిట్లే. అయితే ‘క్రాక్’ సినిమాకి ముందు కూడా ‘సర్కార్’ ‘పందెం కోడి 2 ‘ వంటి డబ్బింగ్ సినిమాలతో అలరించింది వరలక్ష్మీ. అదే టైంలో తమిళ స్టార్ హీరో విశాల్ తో ఈమె ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

కానీ నడిగర్ సంగం గొడవల కారణంగా విడిపోయారు. తర్వాత విశాల్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ.. అది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు విశాల్ – వరలక్ష్మీ లు కూడా ఫ్రెండ్లీగా ఉండటం లేదు. కానీ విశాల్ తో బ్రేకప్ అయ్యాక వరలక్ష్మీకి పెళ్లి పై ఇంట్రెస్ట్ పోయినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే.. ఎప్పుడు ఈమెను పెళ్లి గురించి ప్రశ్నించినా కఠినంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంది.

ఇటీవల వరలక్ష్మీ (Varalaxmi Sarathkumar) పెళ్లి గురించి స్పందించింది. తాజాగా ఈమె బిందు మాధవితో కలిసి ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోకి గెస్ట్ గా వెళ్ళింది. ఈ క్రమంలో ‘పెళ్ళెప్పుడు?’ అంటూ ఓంకార్… వరలక్ష్మీని ప్రశ్నించగా.. అందుకు ఆమె వేళ్ళతో క్రాస్ సిగ్నల్ చూపించింది. అలాగే దానికి అర్ధం అడగ్గా.. ‘పెళ్లనేది బూతు మేటర్, అలాంటి మేటర్ ను నా వద్దకు తీసుకురావద్దు. అందుకే అలా పెట్టాను’ అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. వరలక్ష్మీ ఏ విషయం పై అయినా ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కోసారి అవి వినడానికి చాలా కష్టంగా ఉంటాయి కూడా..!

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus