వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్ లో ఘనంగా ప్రారంభంమైన ఓం శ్రీ “కనకదుర్గ” చిత్రం

నెక్స్ జెన్ పిక్చర్స్ పతాకంపై లంక ఫణిధర్ సమర్పణలో సుమంత్ సైలేంద్ర , మేఘా ఆకాష్ జంటగా లంకా శశిధర్, స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న ఓం శ్రీ “కనకదుర్గ” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో గాడెస్ కనకదుర్గ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు అంబికా కృష్ణ, డి. యస్. రావు, సైలేంద్ర బాబు, మురళి మోహన్, గోపి ఆచంట, దాము ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, శివ శక్తి దత్త నరసింహరాజు, డాక్టర్ ప్రదీప్ జోషి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అంబికా కృష్ణ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి. యస్. రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.., డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గారు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ కార్యక్రమం అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

మురళీ మోహన్ గారు మాట్లాడుతూ.. లంక శివశంకర్ ప్రసాద్ గారు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చాలా ముఖ్యమైన పాత్ర ను ఇందులో చేస్తున్నాను, మంచి టైటిల్ తో, మంచి మనసు ఉన్న మనుషులతో వస్తున్న ఈ చిత్రం యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాను.

చిత్ర దర్శక, నిర్మాత లంకా శశిధర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. నన్ను ఎంకరేజ్ చేసిన నా ఫ్యామిలీ మెంబెర్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీయడం జరిగింది. భారీ గ్రాఫిక్స్ తో లవ్ & ఎంటర్ టైనర్ థ్రిల్లర్ గా తెరకేక్కుతుంది. మా చిత్రంలో నటించడానికి ఒప్ఫకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో మంచి ప్లానింగ్ కుదిరింది. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలలో ఈ సినిమా షూట్ చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తాము.

నటుడు, నిర్మాత డి.యస్ రావు మాట్లాడుతూ.. అమ్మ వారి సినిమాను కమర్షియల్ వేలో తీస్తున్నామని నాకు డెమో చూయించారు. చూడగానే నచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు రిఫర్ చేయగా తనకి కూడా నచ్చడం చాలా సంతోషం. “బ్రాండ్ బాబు” చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ సైలేంద్ర కి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు, లాభం రావాలని కోరుకుంటున్నాను.

క్రియేటివ్ హెడ్ లంకా శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. మా చిన్నబ్బాయి లంకా శశిధర్ కు సినిమా అంటే చిన్నప్పుటి నుండి ఎంతో ఇష్టం. దర్శకుడు అవ్వాలనే తన కల ఇప్పుడు విజయవాడ “కనకదుర్గమ్మ” పేరుతో లవ్ , ఎంటర్టైన్మెంట్ , & క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

సమర్పణ లంకా ఫణిధర్ మాట్లాడుతూ.. మంచి కమర్షియల్ చిత్రంగా త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

డాక్టర్ ప్రదీప్ జోషి మాట్లాడుతూ.. సనాతన ధర్మాలు, హిందూ ధర్మాలతో అమ్మవారి తత్వాలు ప్రేక్షకులకు చూయించాలనే పట్టుదలతో నిర్మిస్తున్న సోషల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను,ఇందులో మంచి పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

చిత్ర హీరో సుమంత్ సైలేంద్ర మాట్లాడుతూ.. ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది.., సీనియర్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్, మేఘా ఆకాష్ మురళి మోహన్ గారులతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

చిత్ర హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ నాకు చాలాబాగా నచ్చింది. నా పాత్ర కూడా చాలా ఎగ్జయ్ టింగ్ గా ఉంటుంది. కొత్త మేఘాను చూస్తారు, మమల్ని, మా టీం అందరినీ ఆదరించి ఆశీర్వాదించాలని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

స్టోరీ స్క్రీన్ ప్లే చేసిన నరేష్ అమరనేని మాట్లాడుతూ.. లంకా శశిధర్ తో, శివ శంకర్ గారితో నేను చాలా రోజులుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ కథ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది.. డివోషనల్ గా తీస్తున్నా ఈ చిత్రంలో ఫుల్ లవ్ & ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి కామెడీ ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి కథ విన్న వెంటనే నచ్చి చేస్తాను అన్నారు. హీరో, హీరోయిన్ లు ఇద్దరి పాత్రలు చాలా బాగా వచ్చాయి.

డైలాగ్ రైటర్ హర శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ప్రతి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం.

సినిమాటోగ్రాఫర్ శ్రీ చిత్ విజయన్ దామోదర్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో నేను భాగం చేసినందుకు డైరెక్టర్ and ప్రొడ్యూసర్ గార్లకి ధన్యవాదములు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాము అని చెప్పారు.

నటీ నటులు
సుమంత్ సైలేంద్ర , మేఘా ఆకాష్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ మోహన్, డి.యస్.రావు తదితరులు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus