విశాల్ పై వరలక్ష్మీ ఫైర్.. కారణం అదే ?

కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మీ గురించి గతంలో చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగిందని తెగ ప్రచారం జరిగింది. అయితే మా మధ్య లాంటిదేమీ లేదని మేము మంచి స్నేహితులం మాత్రమేనంటూ వారు చెప్పుకొచ్చేవారు. అయినా ఆ ప్రచారం ఆగేది కాదు. కానీ విశాల్ కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అవ్వడంతో ఈ ప్రచారం కాస్త సద్దుమణిగింది. ఆ మధ్య నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కి విశాల్ కి మధ్య గొడవలు జరిగినా.. వరలక్ష్మి.. విశాల్ తో స్నేహాన్ని వదులుకోలేదు.

అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల హడావిడి మొదలవ్వడంతో విశాల్ అండ్ టీం శరత్ కుమార్, రాధారవిల పై ఆరోపణలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది చూసిన వరలక్ష్మి కోపంతో విశాల్ పై మండిపడింది. తన కోపాన్ని ఓ లేఖ రూపంలో రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ లేఖ ద్వారా వరలక్ష్మీ స్పందిస్తూ.. ‘విశాల్ ఎలెక్షన్ క్యాంపెయిన్ వీడియో నన్ను ఎంతగానో బాధించింది, ఇప్పటివరకు విశాల్ పై ఏదైనా గౌరవం ఉండేది.. కానీ ఇప్పుడదంతా పోయింది. తప్పులు నిరూపితం కాకుండా నా తండ్రిని పదే పదే టార్గెట్ చేయడం చట్టప్రకారం తప్పు. ఇలాంటి చీప్ వీడియోలను చేయడాన్ని బట్టి నీ పెంపకం ఎలా ఉందో అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో గెలిచిన నువ్వు ఎన్నో మంచి పనులు చేశానని అంటున్నావ్.. వాటి గురించి చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారం చేసుకోవడం మానేసి.. ఈ సారి ఎన్నికల్లో లేని మా నాన్నను టార్గెట్ చేసి ఇలాంటి పనులకి పాల్పడడం సిగ్గుచేటు. ఓ ఫ్రెండ్ గా ఇప్పటివరకూ ఎంతో గౌరవం ఇచ్చానని.. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మన మధ్య దూరాన్ని పెంచింది.” అంటూ పేర్కొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus