Varanasi: ‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Advertisement

రాజమౌళి సినిమా షూటింగ్‌ అంటే అదో నిషిద్ధ ప్రదేశం. షూటింగ్‌లో ఏం జరుగుతోంది అనేది సినిమా వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు. టీజర్‌, ట్రైలర్‌లో చూపిస్తే తప్ప అంతకుముందు తెలియదు. గత కొన్నేళ్లుగా రాజమౌళి ఇలానే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రతిసారి పక్కాగా, పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే లీకులు చాలా తక్కువ. ఏ ఒకటో రెండో అది కూడా క్వాలీటీ లేని వీడియోలు వచ్చేవి. కానీ ‘వారణాసి’ సినిమాకు సంబంధించి లీకులు ఆగడం లేదు.

Varanasi

సినిమా షూటింగ్‌ ప్రారంభం నుండి గ్లింప్స్‌ రిలీజ్‌ వరకు కొన్ని లీకులు వచ్చాయి. అవి కూడా మంచి టైమింగ్‌లో వచ్చాయి. గ్లింప్స్‌ మీద హైప్‌ను పెంచాయి. ఇప్పుడు మరోసారి ‘వారణాసి’ సినిమా సీన్‌ ఒకటి లీక్‌ అయింది. షూటింగ్‌ జరుగుతుండగా దూరం నుండి తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ నదిలో ఓ బోటు.. అందులో మహేష్‌ బాబు.. దాని చుట్టూ స్పీడ్ బోటు చక్కర్లు.. అల్లంత దూరంలో తెప్పలు, పడవలు.. ఇదీ లీక్‌ అయిన సీన్‌.

ఈ సీన్‌ ద్వారా ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది ఏమీ లేదు. ఓ యాక్షన్‌ సీన్‌ షూట్‌ చేశారు అని మాత్రమే అర్థమవుతోంది. అయితే రాజమౌళి సినిమా షూటింగ్‌ నుండి ఓ సీన్‌ బయటకు రావడం అనేది పెద్ద విషయమే. అందులో ఈ సినిమా నుండి రెండో సీన్‌. గతంలో కుంభ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌), రుద్ర (మహేష్‌బాబు) మధ్య ఓ ఎడారి లాంటి ప్రాంతంలో షూట్‌ చేసిన సీన్‌ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ సీన్‌లో ఉన్న లుక్స్‌లో నటుల ఫస్ట్‌ లుక్‌లు బయటకు వచ్చాయి.

ఇప్పుడు ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా బయటకు వచ్చింది కాబట్టి.. త్వరలో సినిమా టీమ్‌ నుండి వచ్చే ప్రమోషనల్‌ వీడియోలో ఆ వీడియో క్లిప్‌ ఉండేలా చూసుకుంటారేమో. ఎందుకంటే ఎలాగూ లీక్‌ అయింది కాబట్టి ఇక దాయడం ఎందుకని.

ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus