Varsha Bollamma: తన వయసుపై క్లారిటీ ఇచ్చిన మిడిల్ క్లాస్ బ్యూటీ!

  • June 4, 2021 / 01:41 PM IST

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది నటి వర్ష బొల్లమ్మ. విజయ్ నటించిన ‘బిగిల్’, ’96’ లాంటి సినిమాల్లో వర్ష ముఖ్య పాత్రలు పోషించింది. ఇలా అలా డబ్బింగ్ సినిమాలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ‘చూసి చూడంగనే’ అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే గతేడాది వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది వర్ష.

ఈ సినిమాలో వర్ష నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిపై మీమ్స్ కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తన అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలను సంధించారు. చాలా మంది ’96’ సినిమాలో నటన, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో వింత ఎక్స్ప్రెషన్స్ గురించి ప్రశ్నించగా.. ఓ నెటిజన్ ఏకంగా ఆమె వయసు గురించి ప్రశ్నించాడు.

‘గూగుల్ లో నీ వయసు 25 ని చూపిస్తుంది. నిజమేనా..?’ అని అడిగాడు. దానికి వర్ష వెరైటీ ఎక్స్ప్రెషన్ ఇస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ కౌంటర్ వేసింది. ‘నేను 96 లో పుట్టాను కాబట్టి నా వయసు 24 ఏళ్లు ఉండాలి. నాకు తెలిసి ఈ విషయం మా అమ్మ కంటే గూగుల్ కే ఎక్కువగా తెలిసి ఉండాలి’ అంటూ సెటైర్ వేసింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus