బుల్లితెర నటీనటులకు కూడా సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోవర్స్ సంఖ్య ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రష్మీ, గెటప్ శీను.. వంటి వారికి ఇంకా ఎక్కువ. ప్రస్తుతానికి వర్షిణి గురించి మాట్లాడుకుందాం. ఈమె పెళ్లి గురించి కొన్నాళ్లుగా గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె హైపర్ ఆదితో ఎక్కువ చనువుగా ఉంటుంది. అందువల్ల కొన్నాళ్ళు హైపర్ ఆది, వర్షిణి లు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడిచింది.
అయితే కొద్ది రోజులుగా ఆదిని పక్కన పెట్టి.. ‘మల్లెమాల’ ప్రొడక్షన్ హౌస్ కి చెందిన ఓ వ్యక్తితో వర్షిణి పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. నిన్న ఆదివారం నాడు వర్షిణి తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ సెషన్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆమె ‘ఏం చేస్తున్నారు?’ అంటూ ఫాలోవర్స్ ను అడుగుతూ ఓ పోస్ట్ పెట్టింది! ఈ క్రమంలో నెటిజన్లు వర్షిణి పెళ్లి గురించి ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు..!
దీంతో (Varshini) వర్షిణి.. ‘నేను ఆస్క్ మి అన్నప్పుడు అడగాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించాను కాబట్టి సమాధానాలు చెప్పాలి’ అంటూ ఆమె వివరించింది. ఈ టైంలో మరికొందరు నెటిజన్లు ‘హైపర్ ఆదితో నీ పెళ్ళెప్పుడు?’ ‘మనం పెళ్లి చేసుకుందామా’ అంటూ ప్రశ్నించారు. దీంతో వర్షిణి విసిగిపోయి.. ‘అందరూ అనుకుంటున్నట్టు నా పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు’ అంటూ ఆమె చెప్పి సైలెంట్ అయిపోయింది.