Varudu Kaavalenu Trailer: నాగ శౌర్య ఖాతాలో మరో హిట్టు చేరినట్టే?

నాగ శౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా లక్ష్మీ సౌజన్య డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన వరుడు కావలెను మూవీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఛలో తర్వాత ఆ స్థాయి హిట్ లేని నాగ శౌర్య, హీరోయిన్ గా కెరీర్ లో పెళ్లిచూపులు మినహా మరో సక్సెస్ లేని రీతూవర్మ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెరిగాయి.

తాజాగా వరుడు కావలెను థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెళ్లిచూపుల కాన్సెప్ట్ నచ్చని అమ్మాయి పాత్రలో రీతూవర్మ నటించగా ఆమె తల్లి పాత్రలో నదియా నటించారు. ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు యువత మెచ్చేలా ట్రైలర్ ఉండటం గమనార్హం. ట్రైలర్ లో నాగశౌర్య స్టైలిష్ గా కనిపించారు. “గుడ్ ఏం లేదు ఆంటీ అంతా బ్యాడే”, “పొగరుబోతులకు ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్ తెలుసా”, “ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్లీ చదివితే కథ మారుతుందా? ముగింపు మారుతుందా?” మరికొన్ని డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య సింపుల్ డైలాగ్స్ తోనే ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు నాగ శౌర్య కొన్ని యాంగిల్స్ లో మిర్చి సినిమాలో ప్రభాస్ లా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటున్న నాగశౌర్య ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని భావించే వాళ్లకు ఈ నెల 29వ తేదీన విడుదలయ్యే వరుడు కావలెను బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. శౌర్య ఖాతాలో మరో హిట్టు చేరినట్టే అని అతని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus