Varun Tej: వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. కటౌట్ ప్లాన్ వేరే లెవెల్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మట్కా మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ప్రామిస్ అనే ఒకే ఒక్క డైలాగ్ ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఈ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాతో సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట్ లో 126 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆపరేషన్ వాలంటైన్ మేకర్స్ ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన వందేమాతరం సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. వరుణ్ తేజ్ వరుస సినిమాలలో నటిస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.వరుణ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ అద్భుతంగా ఉంటే వరుణ్ తేజ్ మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus