Varun Tej: వరుణ్‌తేజ్‌ కొత్త సినిమాకు కొత్త చిక్కులు!

ఏదైనా సినిమా ప్రారంభం అయినప్పుడో, కొన్నాళ్లు అయిన తర్వాతో కాపీ ఆరోపణలు వస్తుంటాయి. లేదంటే… ట్రైలర్‌, టీజర్‌ చూశాక అలాంటి అభియోగాలు వస్తుంటాయి. ఇంకొన్ని అయితే పోస్టర్‌ చూసి కూడా వస్తుంటాయి. ఆ కథ నాది, నేను గతంలో చెప్పాను అంటూ ఒరిజినల్‌ కథ మాదే అనేవాళ్లు వస్తుంటారు. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా తక్కువ. కానీ అలాంటి ఆరోపణలు ఇప్పుడు వచ్చాయి.

ఈ ఆరోపణలు వచ్చిన సినిమా ‘గని’. వరుణ్‌తేజ్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా మీద కాపీ ఆరోపణలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో ‘కాపీ’ ఆరోపణలు ఎదుర్కొన్న రీసెంట్‌ సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా కథ నాది అంటూ ఒకరు వచ్చారు. అయితే ఈ సమస్య సమసిపోయింది. అయితే అదే కుటుంబానికి చెందిన వరుణ్‌తేజ్‌ సినిమాకు ఇప్పుడు సమస్య వచ్చింది. కిక్‌ బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రం ‘గని’. ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్‌ వీడియోస్‌ సినిమాకు మంచి బజ్‌ను తీసుకొచ్చాయి.

అన్నీ అనుకున్నట్లుగా సాగితే ఈ పాటికి సినిమా విడుదలైపోయేది. డిసెంబరు 3న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. అయితే వివిధ కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ డిసెంబరు 24కి వచ్చారు. ఆ తర్వాత ఆ డేట్‌ను కూడా మార్చారు.కొత్త తేదీ ఇంకా చెప్పలేదు. ఈలోపు కాపీ ఆరోపణలు బయటికొచ్చాయి. అయితే, ఈ సినిమా స్టోరీ త‌న‌ద‌ని, గీతా ఆర్ట్స్‌ వాళ్లు కాపీ కొట్టారని, ఆస్ట్రేలియాలో ఉంటున్న వరంగల్ కు చెందిన యువకుడు ప్ర‌దీప్ మ‌డూరి ఆరోపిస్తున్నారు.

మూడేళ్ల క్రితం ఈ కథను అల్లు బాబీకి వినిపించాన‌ని, క‌థ న‌చ్చడంతో సినిమా తీద్దామ‌ని హామీ ఇచ్చార‌ని ప్రదీప్‌ అంటున్నారు. త‌న నుండి స్క్రిప్ట్ తీసుకుని, త‌ర్వాత తననే దూరం పెట్టారని ప్రదీప్‌ చెబుతున్నాడట. కథ మొత్తం నాదే అంటూ ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తా అంటున్నాడు. ఇక ప్రదీప్‌ సంగతి చూస్తే… ఆస్ట్రేలియాలో ఓ యూనివర్సిటీ నుండి సినిమాటోగ్రఫీలో పోస్ట్ గ్రాడ్యూయేట్ చేశాడు. ఆస్ట్రేలియాలో కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. మరి దీనిపై అల్లు అరవింద్‌ అండ్‌ టీమ్‌ ఏమంటుందో చూడాలి.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus