Varun Tej: ‘ఎఫ్‌ 3’ లో వరుణ్ తేజ్ పాత్ర ఇదేనా?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్2 అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు రికార్డు స్థాయిలో షేర్ కలెక్షన్లను తెచ్చుకుని నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను అందించింది. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ కాకపోయినా ఎఫ్2 కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎఫ్3 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటితో బాధ పడే పాత్రలో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ సినిమాలోని వరుణ్ తేజ్ పాత్రకు సంబంధించిన వివరాలు సైతం లీక్ అయ్యాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నత్తితో బాధ పడే వ్యక్తి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. నత్తిగా మాట్లాడుతూ వరుణ్ తేజ్ తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారని సమాచారం. ఎఫ్2 సినిమాను మించి ఫన్ ఉండే విధంగా అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. సినిమాలో మురళీ శర్మ పాత్ర కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ సక్సెస్ లో ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus