ప్రిన్స్ (Prince), నరేష్ అగస్త్య (Naresh Agastya) కలిసి నటించిన ‘కలి’ (Kali) చిత్రం ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 4న విడుదల కాబోతోంది. ‘రుద్ర క్రియేషన్స్’ బ్యానర్ పై ప్రముఖ రైటర్ కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో లీలా గౌతమ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.శివ శేషు దర్శకుడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొంతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న అనగా అక్టోబర్ 2న హైదరాబాద్, మాదాపూర్లోని దస్పల్లా హోటల్లో ఘనంగా జరిగింది.
దీనికి వరుణ్ తేజ్ (Varun Tej), అల్లరి నరేష్ (Allari Naresh), ఆకాష్ పూరి (Akash Puri) .. వంటి హీరోలు గెస్టులుగా హాజరయ్యారు. ఇక ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న క్రమంలో యాంకర్లు రకరకాలుగా అక్కడికి వచ్చిన స్టార్స్ తో ముచ్చట్లు పెడుతుంటారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా నిన్న ఈవెంట్ ను హోస్ట్ చేసిన యాంకర్ స్రవంతి కూడా అక్కడికి గెస్ట్..లుగా వచ్చిన స్టార్స్ తో ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ వద్దకి వెళ్లి.. ఫన్నీ క్వశ్చన్లు వేయాలని అనుకుంది.
ఈ క్రమంలో ఆమె.. ‘ ‘మిస్టర్’ (Mister) సినిమా టైంలో ప్రిన్స్ తో పాటు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi) కూడా సెట్స్ లో ఉన్నారు. అప్పటికే మీరు లావణ్యతో ప్రేమలో ఉన్నారా? ‘ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుందేమో? అని కంగారు పడుతూ జాగ్రత్త పడ్డారా?’ అంటూ వరుణ్ తేజ్ ను ప్రశ్నించింది. ఇందుకు వరుణ్ తేజ్.. ‘అలాంటి విషయాలు బయటకు చెప్పాలనుకోవడం లేదు.’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
అయినా సరే స్రవంతి.. ‘ముందు మీరు ప్రపోజ్ చేశారా? లేక లావణ్య ప్రపోజ్ చేశారా?’ అంటూ మళ్ళీ వరుణ్ తేజ్ ను ప్రశ్నించింది. అందుకు కొంచెం ఇబ్బంది పడ్డ వరుణ్ తేజ్.. ‘ఇది సినిమా ఫంక్షనా? లేక నా గ్రిల్లింగ్(ఇరకాటంలో పెట్టే) ఫంక్షనా’ అంటూ సెటైర్ వేశాడు. దీంతో యాంకర్ షాక్ కి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.