Devara: బిజినెస్ విషయంలో దేవరను ఫాలో అయితే బెటర్.. నష్టాలు రావంటూ?

  • October 3, 2024 / 07:17 PM IST

సాధారణంగా స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలు అంటే రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటాయనే సంగతి తెలిసిందే. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అడ్డూఅదుపు లేకుండా బిజినెస్ చేయడం వల్ల సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమవుతోంది. మూడేళ్ల క్రితం నాన్ బాహుబలి హిట్ గా నిలిచిన ఒక సినిమాకు ఏపీలో దారుణంగా కలెక్షన్లు రావడం గమనార్హం. అయితే దేవర మేకర్స్ మాత్రం ఈ విషయంలో తప్పు చేయలేదు.

Devara

సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కినా బిజినెస్ విషయంలో అత్యాశకు పోలేదు. సినిమా మార్కెట్ కు అనుగుణంగా కేవలం 175 కోట్ల రూపాయల నుంచి 180 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ చేయడం వల్ల ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందనే సంగతి తెలిసిందే. ఇకపై ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లు మొత్తం లాభాలే అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. భవిష్యత్తు పాన్ ఇండియా సినిమాల మేకర్స్ కూడా ఈ విషయంలో దేవరను (Devara) ఫాలో అయితే బాగుంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.

దేవర సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంతోషంతో ఉన్నారు. ఫస్త్ వీకెండ్ కలెక్షన్లతోనే 80 శాతం రికవరీ కావడం దేవరకు ప్లస్ అయింది. భారీ టికెట్ రేట్లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. సోమవారం నుంచి ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు తగ్గనున్నాయి. రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ ఈ సినిమాకు ప్లస్ వుతున్నాయి.

శనివారం, ఆదివారాలలో ఈ సినిమా బుకింగ్స్ మరింత పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర సినిమా కలెక్షన్ల పరంగా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఆఫ్ లైన్ లో సైతం ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నాయి. దాదాపుగా 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న దేవర తారక్  (Jr NTR)  కెరీర్ లో స్పెషల్ మూవీ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

నాగ్ ఫ్యామిలీపై నిరాధార ఆరోపణల వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus