తాము పోషించే పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు కొందరు నటులు. కమల్ హాసన్ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.. తాను పోషించే పాత్రకు అనుగుణంగా తన దేహాకృతిని మార్చుకొనేవారు ఆయన.. ఆ తర్వాత ఆస్థాయి డెడికేషన్ చూపించిన నటుడు సూర్య, విక్రమ్ లు. ఈ ఇద్దరి తర్వాత పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్న నటులు కనిపించలేదు. ధనుష్ విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ.. తన పర్సనాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. ఈ జనరేషన్ హీరోల్లో వరుణ్ తేజ్ పాత్ర కోసం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడంతోపాటు అందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకొంటున్నాడు.
వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆల్రెడీ అమెరికా వెళ్ళి అక్కడ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ ఇప్పుడు ఇండియన్ బాక్సింగ్ ఫార్మాట్ ను కూడా నేర్చుకొనున్నాడు. ఇండియాస్ మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్ అయిన నీరజ్ గోయాట్ మెగాప్రిన్స్ వరుణ్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నాడు. మెగా కజిన్ అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతుండగా.. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!