త్వరలోనే మెగా ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈ జంట నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఎంతో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. అయితే వీరి పెళ్లికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగా వీరిద్దరూ పెళ్లి పనులలో నిమగ్నమయ్యారు.
తాజాగా నటుడు వరుణ్ తేజ్ తో కలిసి లావణ్య త్రిపాఠి షాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరూ ఓ షాపింగ్ మాల్ లో సందడి చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సంబంధించిన హైదరాబాద్ బ్రాచ్ లో సందడి చేశారు. పెళ్లికి ప్రత్యేకమైన దుస్తులను డిజైన్ చేయించడం కోసం ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో వీరు పెళ్లి పనులు మొదలు పెట్టారని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ అనే సినిమా సమయంలో పడ్డారని విషయం వెల్లడించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని అయితే ఈ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఏకంగా నిశ్చితార్థం అంటూ అందరికీ తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు.
జూన్ 9వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అయితే వీరీ వివాహం చాలా సింపుల్ గా విదేశాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుంది అంటూ తెలియజేశారు. ఇక త్వరలోనే వీరి పెళ్లి తేది కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక కెరియర్ విషయానికి వస్తే ఒకవైపు లావణ్య త్రిపాఠి పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటించగా వరుణ్ తేజ్ సైతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.