స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో మెగా హీరో చిత్రం

వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘అంతరిక్షం’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తొలి అంతరిక్ష సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘అంతరిక్షం ‘ ను తెరకెక్కించాడు ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి . డిసెంబర్ 21 న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ‘అంతరిక్షం’ తరువాత మరోసారి సంక్రాంతికి పలకరించడానికి వరుణ్ తేజ్ తో రెడీ అవుతున్నాడు. విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్2’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తాజాగా వరుణ్ తేజ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘గీతా ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తున్నట్టు రీసెంట్ గా వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ తో తన మొదటి చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నాడంట బాబీ. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఏ చిత్రం కోసం వరుణ్ తేజ్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడట. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడట. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించున్నట్టు తాజా సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus