ప్రస్తుతం రజినీ మేనియా నడుస్తోంది. తాను గతంలో నటించిన వరుస సినిమాలు ఫ్లాపులుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో బాక్సాఫీసు వద్ద రజినీ కలెక్షన్ల హవాకు బ్రేక్ పడింది. దీంతో అభిమానుల్లో కొంతకాలంగా అసహనం నెలకొంది. వాటన్నింటినీ ప్రస్తుతం రజినీ జైలర్ సినిమా నెరవేరుస్తోంది. బాక్సాఫీసు వద్ద జైలర్ పంచ్ దెబ్బ ఎంటో చూపిస్తున్నాడు. ఒక్క దెబ్బకే ఇప్పటికి రూ.300కోట్లు వచ్చి పడ్డాయి. ఇంకా కలెక్షన్ల సునామీ ఆగలేదు.. ఆగేటట్లు కూడా కనిపించడం లేదు.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ తో రజినీ స్టామినా ఎంతో చూపిస్తోంది. ఫస్ట్ టాక్ లోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని రూ.1000కోట్ల వసూలు చేసేందుకు రెడీ అవుతోంది. అంతే కాకుండా అక్కడక్కడ వచ్చిన గ్లింప్స్ తో యూట్యూబ్ వ్యూస్ తో షేక్ అవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన అగ్రతారాగణం నటించింది.
వీరిలో ముఖ్యంగా రజనీకాంత్ కొడుకు పాత్రలో నటించిన నటుడు ఎవరంటూ ప్రతి ఒక్కరూ అత్రుతగా తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు ఈ నటుడు గురించి చాలా మందికి తెలియదు. జైలర్ సినిమాలో అతనికి రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అతని పేరు వసంత్ రవి. అతడు చెన్నైలో బాగా పాపులర్ అయిన నమ్మవీడు వసంత భవన్ రెస్టారెంట్ చైర్మన్ తనయుడు. తారామణి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు.
తను మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాకీ, అస్విన్స్ మూవీలో నటించాడు. తాజాగా వసంత్ జైలర్ సినిమాలో రజినీకాంత్ కొడుకుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాలో ఏసీపీ అర్జున్ పాత్రలో కనిపించాడు. క్లైమాక్స్‌లో తన పాత్రకి మంచి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్ నెల్సన్. వసంత్ (Vasanth Ravi) తన పాత్రలో జీవించాడనే చెప్పాలి.