దర్శకుడు క్రిష్ రూపొందించిన ‘వేదం’ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు నాగయ్య శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించిన నాగయ్య తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇచ్చిన డైలాగ్ ని గడగడా చెప్పడంతో అతడి టాలెంట్ ని గుర్తించి ‘వేదం’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్పటినుండి నుండి ‘వేదం’ నాగయ్యగా పిలవడం మొదలుపెట్టారు.
‘నాగవల్లి’, ‘ఒక్కడినే’, ‘రామయ్య వస్తావయ్యా’, ‘స్పైడర్’ ఇలా పలు చిత్రాల్లో నటించిన ఆయన మొదట మూడువేల పారితోషికం అందుకునేవారు. గుంటూరు జిల్లా, నర్సరావు పేట సమీపంలోని దేసవరం పేట గ్రామానికి చెందిన నాగయ్యకు ఊర్లో రెండెకరాల భూమి ఉండేది. అక్కడ పని లేకపోవడంతో కొడుకుతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తరువాత అతడికి అవకాశాలు తగ్గాయి.
తినడానికి తిండి లేక ఆకలి బాధలు భరించలేక భిక్షాటన కూడా చేశారు. నాగయ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకి లక్ష రూపాయల విరాళం అందించారు. అలానే మా అసోసియేషన్ ప్రతి నెల రూ.2500 పింఛన్ గా నాగయ్యకు అందించారు. ఇటీవలే నాగయ్య భార్య మృతి చెందగా.. ఇప్పుడు ఆయన కూడా మరణించడం కుటుంబసభ్యులను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!